Radhe Shyam
Radhe Shyam: అంటీముట్టని వ్యవహారం.. ఎడమొహం పెడమొహంగా యవ్వారం.. ప్రభాస్ – పూజా హెగ్డే బిహేవియర్ చూసి ఇప్పుడు జనం ఇలాగే కామెంట్స్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ కోసం రియల్ లైఫ్ లోనూ వీరిద్దరూ నటిస్తున్నట్టు కనిపిస్తుంది. పక్కపక్కనే ఉండి ఆర్టిఫీషియల్ స్మైల్స్ చూపిస్తున్న గ్లోబల్ స్టార్ – బుట్టబొమ్మ మధ్య ఇంకా పాత గొడవలు చల్లారలేదా..?
Radhe Shyam: టైటానిక్‌ను మించి.. విజువల్ వండర్‌గా రాధేశ్యామ్?
ఇలా సినిమాలో కనిపిస్తూ పర్ఫెక్ట్ పెయిర్ అనిపించుకుంటున్నారు ప్రభాస్ – పూజా హెగ్డే. కానీ బయట దీనికి పూర్తి ఆపోజిట్ గా కనిపిస్తున్నారు వీళ్లిద్దరూ. వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న పాన్ ఇండియా మూవీ కపుల్ అంటే ఎలా ఉండాలి..? కానీ ఎలా ఉండకూడదో చెప్పడానికి ఎక్సాంపుల్ అన్నట్టు గ్లోబల్ స్టార్, బుట్టబొమ్మ చేసి చూపిస్తున్నారు. రీసెంట్ గా ముంబైలో కలిసే ప్రమోషన్స్ చేశారు కానీ న్యాచురల్ బాండింగ్ ను మిస్ చేశారు.
Radhe Shyam: సినిమాలో స్పెషల్ అట్రాక్షన్స్.. నెవెర్ బిఫోర్ ప్రమోషన్స్!
రాధేశ్యామ్ మూవీ షూటింగ్ టైమ్ లో పూజా, ప్రభాస్ కి మధ్య గొడవ జరిగిందని.. కొన్నిరోజులు షూటింగ్ కూడా ఆగిపోయిందనే ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమి లేదని అప్పట్లో రాధేశ్యామ్ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. కానీ రీసెంట్ వ్యవహారం చూస్తుంటే ఒకరంటే ఒకరికి పడట్లేదని తెలుస్తోంది. రీసెంట్ ప్రెస్ మీట్ లో కనీసం ఒకరితో ఒకరు మాట్లాడకోకపోవడం, మాటలు ఒకవైపు చూపులు ఒకవైపు అన్నట్టుండటం.. మీడియా అడుగుతున్న ప్రశ్నలకు సైతం జోవియల్ గా ఆన్సర్స్ ఇవ్వకపోవడం.. ఇలా ఇద్దరి మధ్య కోపం చల్లారలేదన్న విషయం స్పష్టమవుతోంది.
Radhe Shyam: ట్రైలర్‌తో కౌంట్‌డౌన్ స్టార్.. వారం రోజుల పాటు ప్రమోషన్ ఈవెంట్స్!
సంక్రాంతికి ముందు జరిగిన రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సైతం పూజా, ప్రభాస్ ఎవరి దారి వారిదే అన్నట్లున్నారు. కనీసం ఫ్రెండ్లీ కన్వర్జేషన్ కూడా కనిపించలేదు. ఫార్మాలిటీ కోసం హాయ్.. బాయ్ చెప్పుకున్నారు తప్పించి ఓ హీరో, హీరోయిన్ లకు ఉండాల్సిన క్లోజ్ నెస్ లేనేలేదు. స్టేజ్ పై కూడా ఒకరి గురించి మరొకరు మాట్లాడింది తక్కువే. అప్పుడలా.. ఇప్పుడిలా.. మార్చ్ 10 వరకు కంటిన్యూస్ గా ప్రమోషన్స్ చేయబోతున్న ప్రభాస్, పూజా.. అన్నిచోట్ల ఇలాగే ఉంటే అసలేం బాగోదని ఫీలవుతున్నారు డార్లింగ్ ఫ్యాన్స్.