Prabhas
Prabhas : ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్వరలో సంక్రాంతికి రాజాసాబ్ సినిమాతో రాబోతున్నాడు. గత సంవత్సరం ప్రభాస్ కొత్త రచయితలకు, డైరెక్టర్స్ కు ఛాన్స్ ఇస్తాను అని తన అన్న ప్రమోద్ తో కలిసి ది స్క్రిప్ట్ క్రాఫ్ట్ అనే సంస్థని స్థాపించాడు. మీ దగ్గర మంచి కథలు ఉంటే ది స్క్రిప్ట్ క్రాఫ్ట్ వెబ్ సైట్ లో మీ కథను లేదా సినాప్సిస్ ని అప్లోడ్ చేయమని బాగున్న వాళ్ళని పిలుస్తామని ప్రభాస్ గతంలో అధికారికంగా తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.(Prabhas)
ఇప్పుడు తన స్క్రిప్ట్ క్రాఫ్ట్ సంస్థ ద్వారా షార్ట్ ఫిలిం కాంటెస్ట్ నిర్వహిస్తున్నాడు. తాజాగా ప్రభాస్ దీనికి సంబంధించిన వీడియో షేర్ చేసాడు. ఈ వీడియోలో డైరెక్టర్స్ సందీప్ రెడ్డి వంగ, నాగ్ అశ్విన్, హను రాఘవపూడి సినిమాల గురించి, ఛాన్సుల గురించి మాట్లాడుతూ ఈ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ లో పాల్గొనమని చెప్పుకొచ్చారు.
Also Read : Bigg Boss 9 Telugu : రేపే బిగ్ బాస్ ఫైనల్.. ప్రభాస్ – చిరంజీవి ఫైనల్ గెస్ట్ ఎవరు..? ఫ్యాన్స్ గెట్ రెడీ..
ప్రభాస్ తన స్క్రిప్ట్ క్రాఫ్ట్ సంస్థ ద్వారా నిర్వహిస్తున్న ఈ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ లో ఎవరైనా పాల్గొనచ్చు. మీ షార్ట్ ఫిలిమ్స్ బాగుండి, మీ దగ్గర మంచి కథలు ఉంటే భవిష్యత్తులో మీరు ప్రభాస్ నిర్మాణ సంస్థలో డైరెక్టర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది.
ఈ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ లో పాల్గొనాలనుకునే వాళ్ళు ఈ లింక్.. https://www.thescriptcraft.com/register/director ద్వారా రిజిస్టర్ అవ్వాలి. మరెందుకు ఆలస్యం. మీలోని సినిమా ట్యాలెంట్ ని బయటకు తీసి ప్రభాస్ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ లో పాల్గొనండి, భవిష్యత్తులో డైరెక్టర్ అయ్యే ఛాన్స్ పొందండి.
Also Read : Son Of Teaser : ‘సన్ ఆఫ్'(S/O) టీజర్ రిలీజ్.. తండ్రి మీద కేసు వేసిన కొడుకు..