Son Of Teaser : ‘సన్ ఆఫ్'(S/O) టీజర్ రిలీజ్.. తండ్రి మీద కేసు వేసిన కొడుకు..
సన్ ఆఫ్ టీజర్ మీరు కూడా చూసేయండి.. (Son Of Teaser)
Son Of Teaser
Son Of Teaser : సాయి సింహాద్రి సైన్మా బ్యానర్ పై సాయి సింహాద్రి హీరోగా, నిర్మాతగా తెరకెక్కుతున్న సినిమా ‘సన్ ఆఫ్’ (S/O). బత్తల సతీష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు వినోద్ కుమార్ కీలక పాత్రలో నటించారు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు.(Son Of Teaser)
ఈ టీజర్ చూస్తుంటే ఓ గాలికి తిరిగే కొడుకుని తండ్రి తిడుతుండటం, కొడుతుండటం చేయగా కొడుకు తండ్రి మీద కోపంతో కోర్ట్ లో కేసు వేసినట్టు తెలుస్తుంది. మరి ఏం కేసు వేసాడు? ఎందుకు వేసాడు తెలియాలంటే సినిమా వచ్చేదాకా ఎదురుచూడాల్సిందే. సన్ ఆఫ్ టీజర్ మీరు కూడా చూసేయండి..
Also Read : Bigg Boss 9 Telugu : రేపే బిగ్ బాస్ ఫైనల్.. ప్రభాస్ – చిరంజీవి ఫైనల్ గెస్ట్ ఎవరు..? ఫ్యాన్స్ గెట్ రెడీ..
టీజర్ లాంచ్ ఈవెంట్లో సీనియర్ నటుడు వినోద్ కుమార్ మాట్లాడుతూ.. సన్ ఆఫ్ సినిమా రెగ్యులర్ సినిమా కాదు. ఇది స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమా. ఓ తండ్రి, కొడుకుల మధ్య సాగే కథ ఇది. సాయి సింహాద్రి ఎక్కడో పర్లాకిమిడిలో చదివి అమెరికాకు వెళ్ళి అక్కడి నుంచి వచ్చి ఈ సినిమా తీశారు. డైరెక్టర్ సతీష్ 45 నిమిషాలు కథ బాగా నెరేషన్ చేశారు. ఈ కథ మా అబ్బాయికి కూడా చెప్పాను. నేను ప్రస్తుతం గోపీచంద్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో నటిస్తున్నాను అని తెలిపారు.

డైరెక్టర్ సతీష్ మాట్లాడుతూ.. ఈ సినిమా ఆయన కెరీర్ లో ‘మామ గారు’ సినిమాలుగా నిలుస్తుంది. మా హీరో సాయి సింహాద్రి నన్ను నమ్మి అమెరికా నుంచి వచ్చి ఈ సినిమా చేశారు. కొడుకు తండ్రి మీద ఎందుకు కేసు వేశాడు అనేది చాలా స్ట్రాంగ్ గా చూపించాం అని అన్నారు. హీరో, నిర్మాత సాయి సింహాద్రి మాట్లాడుతూ.. ఇలాంటి కథను సినిమా తీయాలి అని ఎప్పట్నుంచో అనుకున్నాను. ఈ కథ రియల్ లైఫ్ లో నాకూ, మా నాన్నకు కూడా కనెక్ట్ అవుతుంది. ప్రతి కొడుకు తన తండ్రికి చూపించాల్సిన సినిమా ఇది. నేను చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్ ని. ఆయనకి ఈ సినిమా చూపించాలి అని అన్నారు.
Also See : Pranavi Manukonda : తిరుమలలో నటి ప్రణవి మానుకొండ.. ఫొటోలు చూశారా..?
