Prabhas: ప్రభాస్‌ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడా?

ఇక నుంచి ప్రభాస్ పెళ్లికి సంబంధించి వరుస అప్డేట్స్ రాబోతున్నాయట!

Hero Prabhas

టాలీవుడ్‌ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ ఎవరంటే సెకండ్ కూడా ఆలోచించకుండా చెప్పే పేరు ప్రభాస్. అందుకే డార్లింగ్‌ పెళ్లి అంటే ఎప్పుడూ క్రేజీ న్యూసే. అయితే ఈసారి వచ్చిన న్యూస్ అయితే పక్కా అన్న టాక్ వినిపిస్తోంది. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి పీటలెక్కబోతున్నాడట.? త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడని తెలుస్తోంది. ప్రభాసే తన పెళ్లి గురించి ఓ మంచి గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడట. దసరా పండగ రోజు ప్రభాస్ తన పెళ్లి అప్డేట్స్‌ ప్రకటిస్తారని అంటున్నారు. తన పుట్టిన రోజు అక్టోబర్ 23న ఎంగేజ్ మెంట్ చేసుకునేందుకు కూడా రెడీ అవుతున్నాడట.

ఇక నుంచి ప్రభాస్ పెళ్లికి సంబంధించి వరుస అప్డేట్స్ రాబోతున్నాయట. అయితే ప్రభాస్ పెళ్లి చేసుకునే అమ్మాయి ఎవరు.? ఆమె ఏం చేస్తారనే విషయాలు తెలుసుకునేందుకు ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్‌మెంట్‌తో ఉన్నారు. అయితే డార్లింగ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి సినీ పరిశ్రమకు చెందినవారు కాదని తెలుస్తోంది. తన సొంత ఊరు మొగల్తూరుకు చెందిన అమ్మాయినే ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడట. ఆ అమ్మాయి ప్రభాస్‌కు దగ్గరి బంధువు అంటున్నారు. ఇప్పటికే పెళ్లి వేడుకలు స్టార్ట్ కావాల్సి ఉండగా.. డార్లింగ్‌ బిజీ షెడ్యూల్‌తో వాయిదా పడుతూ వచ్చినట్లు చెబుతున్నారు.

త్వరలోనే ప్రభాస్‌ వెడ్డింగ్‌ అంటూ నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నా.. దీనిపై అధికారికంగా క్లారిటీ రావడం లేదు. అయితే ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ఈ మధ్యే‌ విజయవాడ కనకదుర్గను దర్శించుకున్నాక..మీడియాతో చిట్ చాట్ చేశారు. ప్రభాస్‌ వెడ్డింగ్ అనౌన్స్‌మెంట్‌ త్వరలోనే ఉంటుందని చెప్పారు. ఆమె చెప్పిందే నిజం కాబోతుందన్న చర్చ జరుగుతోంది.

VV Vinayak : ద‌ర్శ‌కుడు వి.వి వినాయ‌క్ బ‌ర్త్‌డే.. విషెస్ చెప్పిన చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్‌.. ఫోటోలు