Prabhas Movies : ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. ప్రభాస్ నెక్స్ట్ సినిమాలు.. భారీ లైనప్..

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అరడజను సినిమాలకు పైనే ఉన్నాయి.

Prabhas Birthday Special Prabhas Next Movies Huge Line up

Prabhas Movies : బాహుబలితో ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకున్న మన డార్లింగ్ ప్రభాస్ ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. పాన్ ఇండియా సినిమాలకు ప్రాణం పోసాడు ప్రభాస్. బాహుబలి తర్వాత అన్ని భారీ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇటీవలే బ్యాక్ టు బ్యాక్ సలార్, కల్కి సినిమాలతో హిట్స్ కొట్టాడు. ప్రభాస్ సినిమా అంటే ఓపెనింగ్ రోజే 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్, ఓవరాల్ గా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ ఈజీగా వస్తాయని అంతా ఫిక్స్ అయ్యారు. బాలీవుడ్ స్టార్స్ కి సైతం సాధ్యం కాని రికార్డులు ప్రభాస్ సాధిస్తున్నారు.

ప్రభాస్ సినిమాలకు భారీ కలెక్షన్స్ వస్తుండటంతో, పాన్ ఇండియా వైడ్ కాకుండా విదేశాల్లో కూడా ప్రభాస్ సినిమాలకు డిమాండ్ పెరగడంతో దర్శక నిర్మాతలు ప్రభాస్ తో సినిమాలు చేయడానికి ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ కూడా భారీ సినిమాలు ఒప్పుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అరడజను సినిమాలకు పైనే ఉన్నాయి.

Also See : Prabhas Sister Praseedha : అన్నయ్యతో స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన ప్రభాస్ చెల్లి.. ఫొటోలు చూశారా?

ప్రస్తుతం ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో రాజాసాబ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే సంవత్సరం ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. హారర్ కామెడీ లవ్ కాన్సెప్ట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. నేడు పుట్టిన రోజు నాడు ఈ సినిమా నుంచి గ్లింప్స్ కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నట్టు తెలుస్తుంది.

ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమా చేయనున్నాడు. ఇందులో ప్రభాస్ పోలీసాఫీసర్ గా కనిపించనున్నాడు. వీటి తర్వాత కల్కి సీక్వెల్ కల్కి 2 సినిమా, సలార్ సీక్వెల్ సలార్ 2 సినిమా, బాలీవుడ్ లో కూడా ఓ సినిమా ఉందని సమాచారం. ఇలా అన్ని భారీ ప్రాజెక్టులతో ప్రతి సినిమాకు 1000 కోట్ల పైనే కలెక్షన్స్ టార్గెట్ పెట్టుకొని పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నాడు. దీంతో ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు..