Adipurush : చిరంజీవి గారు ఏంటి రామాయణంలో నటిస్తున్నావా? అని ప్రశ్నించారు..

ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ చిరంజీవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్ రామాయణం కథతో సినిమా చేస్తున్నాడని తెలిసి చిరంజీవి..

Adipurush Pre Release Event : ప్రభాస్ (Prabhas) రాముడిగా, కృతి సనన్ (Kriti Sanon) సీతగా, సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) రావణాసురుడిగా.. రామాయణం బ్యాక్‌డ్రాప్ తో తెరకెక్కిన సినిమా ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా నుంచి ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ ఆడియన్స్ లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. జూన్ 16న ఈ చిత్రాన్ని చూడడానికి అభిమానులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు (జూన్ 6) తిరుపతి (Tirupati) శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో జరుగుతుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చినజీయర్ స్వామి ముఖ్య అతిథిగా రాబోతున్నారు.

Adipurush : ఆదిపురుష్ మూవీతో బాలీవుడ్‌కి భయం పుడుతుందా.. ఎందుకో తెలుసా?

ఇక ఈ కార్యక్రమంలో ప్రభాస్ అభిమానులని ఉద్దేశించి మాట్లాడుతూ.. “మీరు ఇచ్చిన నమ్మకమే మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకు వచ్చింది. మీరు ఇచ్చిన ఒక ధైర్యం మమ్మల్ని రాత్రి పగలు పోరాడి ఒక గొప్ప సినిమాని మీ ముందుకు తీసుకు వచ్చేలా చేసింది. ఆదిపురుష్ అనే సినిమాలో మేము నటించాం అనడం కంటే ఒక గొప్ప కథలో మేము భాగం అయ్యాము అని అనడం కరెక్ట్. ఒకసారి చిరంజీవి గారు నన్ను అడిగారు. ఏంటి రామాయణం కథలో నటిస్తున్నావా? అని ప్రశ్నించారు. నేను అవును అని బదులిచ్చా. అప్పుడు చిరంజీవి గారు ఒక మాట చెప్పారు. ఆ కథలో నటించడం ఒక అదృష్టం అంటూ చెప్పారు” అని ప్రభాస్ చెప్పుకొచ్చాడు.

Naga Chaitanya : హిందీ హారర్ మూవీ రీమేక్‌లో అక్కినేని హీరో.. క్లారిటీ ఇచ్చిన చైతన్య టీం!

కాగా ఈ ఈవెంట్ లో ఆదిపురుష్ సెకండ్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ని ఫుల్ యాక్షన్ కట్ తో రెడీ చేశారు. ‘వస్తున్నా రావణ’ అంటూ రాముడు రావణుడి పై యుద్ధం ప్రకటిస్తూ ట్రైలర్ అదిరిపోయింది. ఇక ఈ సెకండ్ ట్రైలర్ ని చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. గతంలో బాహుబలి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా తిరుపతిలోనే చాలా గ్రాండ్ గా జరిగింది. ఇప్పుడు ఆదిపురుష్ కూడా అక్కడే జరుగుతుండడంతో ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందని అభిమానులు చెబుతున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు