Prabhas : ఈ సినిమాలో నేనొక కమెడియన్‌ని.. ప్రాజెక్ట్ K సినిమాపై హాలీవుడ్ మీడియాతో ప్రభాస్ వ్యాఖ్యలు..

ఈవెంట్ లోకి వెళ్లేముందు ప్రాజెక్ట్ K యూనిట్ మీడియాతో మాట్లాడారు. ప్రభాస్ కూడా హాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Prabhas Comments on Project K Kalki 2898AD Movie with Hollywood Media

Prabhas :  నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ K. దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే (Deepika Padukone), దిశా పఠాని, కమల్ హాసన్.. ఇలా చాలామంది స్టార్స్ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ అమెరికా కాలిఫోర్నియాలోని San Diegoలో నిర్వహించే ప్రతిష్టాత్మక ఈవెంట్ కామిక్ కాన్ లో రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ లో పాల్గొన్న మొదటి ఇండియన్ సినిమాగా ప్రాజెక్ట్ K సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. ఈ కార్యక్రమానికి దర్శక నిర్మాతలతో పాటు ప్రభాస్, కమల్ హాసన్, రానా పాల్గొన్నారు.

సినిమాకు టైటిల్ చాలా మంది ఊహించినట్టే కల్కి అని పెట్టారు. ఇక సినిమా టైటిల్ కింద 2898 AD అని పెట్టారు. ఈ గ్లింప్స్ చూస్తుంటే హాలీవుడ్ రేంజ్ లో ఉంది. దీంతో ఒక్కసారిగా ప్రాజెక్ట్ K సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. కచ్చితంగా ఈ సారి హాలీవుడ్ టార్గెట్ గా నాగ్ అశ్విన్ గట్టిగానే ఏదో ప్లాన్ చేశాడని అర్ధమవుతుంది. ఇక ఈవెంట్ లోకి వెళ్లేముందు ప్రాజెక్ట్ K యూనిట్ మీడియాతో మాట్లాడారు. ప్రభాస్ కూడా హాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Kalki 2898 AD : ప్రాజెక్ట్ K గ్లింప్స్ లో ఇది గమనించారా? అమితాబ్ క్యారెక్టర్ ఉండదా? ప్రాజెక్ట్ K గ్లింప్స్ డిటైలింగ్..

ప్రభాస్ కల్కి సినిమా గురించి హాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ.. ఇది ఒక సూపర్ హీరో సినిమా. ఇందులో క్యారెక్టర్ కొంచెం ఫన్ గా కూడా ఉంటుంది. నాగ్ అశ్విన్ నా క్యారెక్టర్ ని డిజైన్ చేసిన తీరు నాకు బాగా నచ్చింది. నాగి కూడా చాలా ఫన్నీగా ఉంటాడు. సినిమాలో స్ట్రాంగ్ ఎమోషన్స్ కూడా ఉంటాయి. నేను ఈ సినిమాలో కమెడియన్ ని అని అన్నాడు. దీంతో ప్రభాస్ కామెంట్స్ కి అంతా ఆశ్చర్యపోతున్నారు. గ్లింప్స్ అంత సీరియస్ గా ఉంటే ప్రభాస్ కామెడీ క్యారెక్టర్ అంటాడేంటి అని అనుకుంటున్నారు అంతా. ప్రభాస్ సరదాగా చెప్పాడా? లేక నిజంగానే సినిమాలో కామెడీ కూడా ఉంటుందా అని సందేహిస్తున్నారు అభిమానులు, నెటిజన్లు.

ట్రెండింగ్ వార్తలు