Prabhas : ప్రభాస్ ఒక్కడే ఆ రికార్డ్ సెట్ చేసిన ఇండియన్ హీరో.. ఏకంగా 5 సార్లు..

ప్రభాస్ సినిమా వస్తుందంటే కలెక్షన్స్ కూడా భారీగా వస్తాయని ఫిక్స్ అయిపోయారు.

Prabhas : ప్రభాస్ తాజాగా కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో భారీ హిట్ కొట్టాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టి పాన్ ఇండియా సినిమాలు పరిచయం చేసి మొదటి పాన్ ఇండియా స్టార్ గా పిలిపించుకున్నాడు. బాహుబలి 2 నుంచి ప్రభాస్ ఇండియా వైడ్ స్టార్ డమ్ తెచ్చుకోవడమే కాక విదేశాల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.

ఇక ప్రభాస్ సినిమా వస్తుందంటే కలెక్షన్స్ కూడా భారీగా వస్తాయని ఫిక్స్ అయిపోయారు. సినిమా టాక్ ఎలా ఉన్నా మొదటి రోజు ఈజీగా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వస్తాయని ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఫిక్స్ అయిపోయారు. ఇప్పటికే తన సినిమాలతో అనేక రికార్డులు సెట్ చేసిన ప్రభాస్ తాజాగా కల్కి సినిమాతో మరో సరికొత్త రికార్డ్ సెట్ చేసాడు.

Also Read : Prabhas : ‘కల్కి’లో ప్రభాస్ చేసిన పాత్ర.. ఆల్రెడీ ఏక్ నిరంజన్ సినిమాలోనే చేసేసాడు తెలుసా..?

ఇండియాలో ఏ స్టార్ హీరో సాధించలేని రికార్డ్ ప్రభాస్ సాధించాడు. ఓపెనింగ్ రోజు 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ఏకంగా 5 సినిమాలతో సాధించి సరికొత్త రికార్డ్ సెట్ చేసాడు. ఏ బాలీవుడ్ హీరోకి కూడా ఓపెనింగ్ రోజు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చిన సినిమాలు ఇన్ని లేవు. దీంతో ప్రభాస్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ప్రభాస్ బాహుబలి 2, సాహో, ఆదిపురుష్, సలార్, కల్కి సినిమాలతో మొదటి రోజు 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసాడు.

Also Read : Kalki Fight Master : కల్కిలో యాక్షన్ సీక్వెన్స్ డిజైన్ చేసింది ఎవరో తెలుసా? జర్మన్ ఫైట్ మాస్టర్.. మేకింగ్ వీడియో రిలీజ్..

బాహుబలి 2 సినిమా మొదటి రోజు 217 కోట్ల గ్రాస్ ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసింది. సాహో మొదటి రోజు 130 కోట్ల కలెక్షన్స్, ఆదిపురుష్ మొదటి రోజు 140 కోట్లు, సలార్ 178 కోట్లు మొదటి రోజు వసూలు చేసాయి. నిన్న రిలీజయిన కల్కి సినిమా మొదటి రోజు 180 కోట్లకు పైగా కలెక్ట్ చేసినట్టు సమాచారం.

ట్రెండింగ్ వార్తలు