డార్లింగ్ ఇటలీ బయలు దేరాడు..

  • Publish Date - October 1, 2020 / 11:27 AM IST

Radhe shyam

Rebelstar Prabhas: కరోనా కారణంగా ఇన్నాళ్లూ ఇళ్లకే పరిమితిమైన స్టార్స్ లాక్‌డౌన్ సడలింపుతో ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఇప్పటికే కొందరు షూటింగ్ స్టార్ట్ చేసేశారు. తాజాగా రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్‌ ప్ర‌భాస్ కూడా షూటింగ్‌కు రెడీ అయిపోయాడు.


‘జిల్’ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ‘రాధేశ్యామ్’ బ్యాలెన్స్ షూట్ విదేశాల్లో ప్రారంభం కానుంది. యూవీ క్రియేషన్స్, టి సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ ఇటలీలో జరుగనుంది.

ఇందుకోసం డార్లింగ్ ఇటలీకి బయలుదేరాడు. ఎయిర్ పోర్ట్‌లో ప్రభాస్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ‘రాధేశ్యామ్’ వచ్చే ఏడాది విడుదల కానుంది.