×
Ad

Rajasaab : అసలు ఇదేం ప్లాన్ ‘రాజాసాబ్’.. ఇప్పుడు సడెన్ గా ఇన్ని రోజుల ముందే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏంటి..?

రాజాసాబ్ సినిమా సంక్రాతి కానుకగా జనవరి 9న రిలీజ్ కానుంది. (Rajasaab)

Rajasaab

Rajasaab : ప్రభాస్ రాజాసాబ్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమాపై ప్రభాస్ గత సినిమాలంత అంచనాలు లేవు. సినిమా వాయిదా పడటం, టీజర్, ట్రైలర్స్ ఎప్పుడో రిలీజ్ చేసేయడం, పాటలు కూడా అంతంత మాత్రం ఉండటంతో సినిమా రిలీజ్ దగ్గరికి వస్తున్నా అంత హైప్ లేదు. ప్రభాస్ మొదటి సారి హారర్ కామెడీ చేస్తున్నాడు అనే ఒకే ఒక పాయింట్ ఈ సినిమాకు ప్లస్ అవుతుంది.(Rajasaab)

రాజాసాబ్ సినిమా సంక్రాతి కానుకగా జనవరి 9న రిలీజ్ కానుంది. ప్రభాస్ సాధారణంగానే ప్రమోషన్స్ కి ఎక్కువగా రాడు. అయితే ఈసారి రాజాసాబ్ సినిమా టీమ్ ప్రమోషన్స్ సరిగ్గా ప్లాన్ చెయ్యట్లేదు అని ఫ్యాన్స్ బాధపడుతున్నారు. టీజర్, ట్రైలర్స్ ఏకంగా రెండు మూడు నెలల ముందే రిలీజ్ చేసి తప్పు చేసారు అన్నారు. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏకంగా రెండు వారాల ముందే పెట్టేసారు.

Also Read : Avinash Thiruveedhula : తీసుకున్న డబ్బులకు న్యాయం చేయాలి కదా.. నందు పై కొత్త హీరో సంచలన కామెంట్స్..

రాజాసాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ కైతలాపుర్ గ్రౌండ్ లో చాలా తక్కువ మంది ఫ్యాన్స్ మధ్య ఈవెంట్ జరగనుంది. అసలు ముందు నుంచి ఎలాంటి సమాచారం లేకుండా నిన్న సాయంత్రం ప్రకటించారు. సాధారణంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ సినిమా రిలీజ్ కి రెండు మూడు రోజుల ముందో లేక ఓ వారం ముందో పెడతారు. ఇప్పుడు ఏకంగా రెండు వారాల ముందు పెట్టారు. అది కూడా న్యూ ఇయర్ హడావిడి మొదలవుతున్న సమయంలో.

దీంతో అసలు ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టమని ఎవరు అడిగారు, ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు అని నిర్మాణ సంస్థని ప్రశ్నిస్తున్నారు. అంతే కాకుండా భారీగా ఈవెంట్ చేయకుండా సడెన్ గా ప్రకటించి సింపుల్ గా చేస్తుండటంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఈవెంట్ నిర్వహణ సంస్థ ఈవెంట్ చేయడానికి ప్లేస్ లు ఖాళీ లేవు, పర్మిషన్స్ లేవు, న్యూ ఇయర్ పార్టీలు ఉన్నాయి అందుకే ఆ గ్రౌండ్ లో సింపుల్ గా ఇప్పుడు పెడుతున్నాం అని వివరణ ఇచ్చారు. దీంతో న్యూ ఇయర్ అయిన తర్వాత పెట్టొచ్చు కదా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇన్ని రోజుల ముందు ఎందుకు అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : Producer SKN : ఏ బట్టల సత్తి గాడి మాటలు వినక్కర్లేదు.. శివాజీ పై నిర్మాత SKN సంచలన వ్యాఖ్యలు..

అసలే రాజసాబ్ సినిమాకు కావాల్సినంత హైప్ లేదురా బాబు అంటే ప్రమోషన్స్ సరిగ్గా ప్లాన్ చేయకుండా, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏమో రెండు వారాల ముందే పెడుతున్నారంటే సినిమా రిలీజ్ ముందు ఏం చేస్తారో చూడాలి మరి.