×
Ad

Prabhas Fans : డబ్బాలకు డబ్బాలు బిర్యానీ పంపించిన ప్రభాస్ ఫ్యాన్స్.. కానీ డైరెక్టర్ తినకుండా..

ప్రభాస్ మాత్రమే కాదు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా భారీగా ఫుడ్ పంపించారు ఇప్పుడు. (Prabhas Fans)

Prabhas Fans

Prabhas Fans : ప్రభాస్ అతిధి మర్యాదలు ఎలా ఉంటాయో అందరికి తెలిసిందే. కడుపునిండా ఫుడ్ పెడతాడు. ప్రభాస్ ఫుడ్ గురించి అతనితో పనిచేసిన వాళ్లంతా చెప్తారు. ప్రభాస్ మాత్రమే కాదు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా భారీగా ఫుడ్ పంపించారు ఇప్పుడు. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రాజాసాబ్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9 న రిలీజ్ కానుంది.(Prabhas Fans)

మొదట్లో ఈ సినిమాపై అనుమానాలు ఉన్నా, ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్, తాజాగా రిలీజ్ చేసిన రాజాసాబ్ సెకండ్ ట్రైలర్ చూసాక సినిమా పెద్ద హిట్ అవుతుందని, ప్రభాస్ అదరగొట్టేస్తాడని ఫ్యాన్స్ అంచనాలు పెంచుకుంటున్నారు. ఈవెంట్, ట్రైలర్ తో ఫ్యాన్స్ హ్యాపీ అయ్యారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో సినిమా బాగోకపోతే మా ఇంటికి రండి అని డైరెక్టర్ మారుతీ ఇంటి అడ్రెస్ కూడా చెప్పాడు.

Also Read : Rashmika Mandanna : ఈసారి మరిదితో కలిసి ఆ దేశానికి రష్మిక ట్రిప్.. ఫొటోలు.. విజయ్ ఎక్కడ?

అయితే ట్రైలర్ తో హ్యాపీ అయిన ప్రభాస్ ఫ్యాన్స్ ఏకంగా 6 బాక్సులు రకరకాల బిర్యానీ డైరెక్టర్ మారుతీ ఇంటికి పంపించాడు. ఆ బిర్యానీ డబ్బాలను మారుతి ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసి.. డార్లింగ్స్.. మాటల్లో చెప్పలేకపోతున్నా. నేను ఇంటికి వచ్చేసరికి సర్ ప్రైజ్ చేసారు. రాజాసాబ్ ట్రైలర్ ప్రేమతో బిర్యానీ పంపించినందుకు థ్యాంక్స్. జనవరి 9న మీకు రిటర్న్ ట్రీట్ ఇస్తాను అని పోస్ట్ చేసారు.

అయితే నిన్న వైకుంఠ ఏకాదశి అవ్వడంతో నాన్ వెజ్ తినకూడదు అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా.. నేను తిరుపతికి వెళ్లేముందు ఇవి వచ్చాయి. వైకుంఠ ఏకాదశితో పాటు, తిరుపతికి వెళ్తున్నాను కాబట్టి తినలేదు. కానీ వాళ్ళ ప్రేమని అర్ధం చేసుకున్నాను అని రిప్లై ఇచ్చాడు మారుతి.  దీంతో మారుతీ పోస్ట్ వైరల్ గా మారింది. ప్రభాస్ మాత్రమే కాదు నచ్చితే ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఫుడ్ బాగా పెడతారు అని కామెంట్స్ చేస్తున్నారు. మరి రాజాసాబ్ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

Also Read : Mad Movies : ఎన్టీఆర్ బామ్మర్దితో పాటు వాళ్ళందర్నీ పక్కన పెట్టి.. ఆ సినిమా లేదంట..మరి?