Prabhas Fans : కల్కి సినిమా టికెట్స్ కోసం.. సినిమా ఆఫీస్ ముందు ప్రభాస్ అభిమానుల మౌన దీక్ష..
ఇప్పటికే పలుచోట్ల కల్కి సినిమా టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయగా అన్ని చోట్ల టికెట్స్ అమ్ముడుపోయాయి.

Prabhas Fans Strike at Vyjayanthi Films Office n Hyderabad for Movie Tickets
Prabhas Fans : ప్రభాస్ కల్కి సినిమా కోసం అభిమానులతో పాటు దేశమంతా ఎదురుచూస్తుంది. హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే పలుచోట్ల కల్కి సినిమా టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయగా అన్ని చోట్ల టికెట్స్ అమ్ముడుపోయాయి. ఓవర్సీస్, వేరే రాష్ట్రాల్లో కల్కి టికెట్ బుకింగ్స్ మొదలయినా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇంకా కొన్ని చోట్ల టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయలేదు.
దీంతో ప్రభాస్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొంతమంది ప్రభాస్ అభిమానులు నిన్న హైదరాబాద్ లోని కల్కి చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి ఫిలిమ్స్ ఆఫీస్ వద్దకు వచ్చి ఆందోళన చేశారు. కల్కి సినిమా టికెట్స్ ఇవ్వాలని, కల్కి సినిమా టికెట్స్ బుకింగ్స్ ఓపెన్ చేయాలని వైజయంతి ఫిలిమ్స్ ఆఫీస్ బయట మౌన దీక్ష చేశారు. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు ప్రభాస్ అభిమానులు అలాగే మౌన దీక్ష చేశారు.
Also Read : Sukriti : ఫ్యాషన్ షోలో సుకుమార్ కూతురు.. మోడ్రన్ డ్రెస్‌లో ర్యాంప్ వాక్ అదరగొట్టిందిగా..
దీంతో ప్రభాస్ అభిమానులు వైజయంతి ఆఫీస్ ముందు దీక్ష చేస్తున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. దీనిపై పలువురు విమర్శలు చేస్తున్నారు. సినిమా ముందు రోజు అయినా టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేస్తారు, ఆఫీస్ కి వెళ్లి ఎందుకు గొడవ చేయడం అంటూ పలువురు విమర్శలు చేస్తుంటే మరికొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. మొత్తానికి కల్కి సినిమా అన్ని రకాలుగా వైరల్ అవుతుంది.