Sukriti : ఫ్యాషన్ షోలో సుకుమార్ కూతురు.. మోడ్రన్ డ్రెస్‌లో ర్యాంప్ వాక్ అదరగొట్టిందిగా..
సుకుమార్ కూతురు తాజాగా సుకృతి ఓ ఫ్యాషన్ షోలో పాల్గొంది.

Director Sukumar Daughter Sukriti Participated in Fashion Show as Model Photos goes Viral
Sukumar Daughter Sukriti : మన సెలబ్రిటీల పిల్లలు ఎదుగుతుంటే అభిమానులు, సినిమా లవర్స్ కూడా వాళ్ళని చూసి సంతోషం వ్యక్తం చేస్తారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి ఇటీవల వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం తను నటించిన సినిమాకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. ఇక సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటుంది సుకృతి.
Also Read : Kalki 2898 AD : ‘కల్కి’ కోసం ఏపీలో కూడా భారీగా టికెట్ రేట్లు పెంపు.. ఎంతంటే..?
సుకుమార్ కూతురు తాజాగా సుకృతి ఓ ఫ్యాషన్ షోలో పాల్గొంది. సుకృతికి కూడా సినిమా, ఫ్యాషన్ రంగం వైపే ఆసక్తి ఉంది. భవిష్యత్తులో స్టార్ మోడల్, హీరోయిన్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. తాజాగా ఓ ఫ్యాషన్ షోలో మోడ్రన్ డ్రెస్ లో ర్యాంప్ వాక్ చేసి అదరగొట్టింది. ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. సుకృతి ఆ ఫోటోలను షేర్ చేస్తూ.. ఫస్ట్ టైం ఫ్యాషన్ మోడల్ గా ఫ్యాషన్ షోకి పనిచేయడం గర్వంగా ఉంది అని తెలిపింది.
దీంతో సుకృతి ఫ్యాషన్ షో ఫోటోలు వైరల్ గా మారాయి. సుకుమార్ కూతురు అప్పుడే ఇంత పెద్దగా అయిపోయిందా, ఫ్యూచర్ లో సినిమాల్లోకి వస్తుందేమో అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక పలువురు మోడల్ గా సుకృతి తన ఫస్ట్ ఫ్యాషన్ షో చేసినందుకు అభినందిస్తున్నారు.