Kalki 2898 AD : ‘కల్కి’ కోసం ఏపీలో కూడా భారీగా టికెట్ రేట్లు పెంపు.. ఎంతంటే..?

భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ రేట్లు పెంచుతారని తెలిసిందే.

Kalki 2898 AD : ‘కల్కి’ కోసం ఏపీలో కూడా భారీగా టికెట్ రేట్లు పెంపు.. ఎంతంటే..?

Prabhas Kalki 2898 AD Movie Ticket Rates Hike in Andhra Pradesh Full Details

Updated On : June 25, 2024 / 7:37 AM IST

Kalki 2898 AD : భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ రేట్లు పెంచుతారని తెలిసిందే. ఇప్పుడు ప్రభాస్(Prabhas) కల్కి సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కల్కి సినిమా నుంచి నుంచి రిలీజ్ చేసిన రెండు ట్రైలర్స్ తో హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతుందని ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. స్టార్ నటీనటులతో తెరకెక్కించిన కల్కి 2898AD సినిమా జూన్ 27న రిలీజ్ కాబోతుంది.

ఇప్పటికే ఈ సినిమాకు తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్ కు 70 రూపాయలు, మల్టీప్లెక్స్ లకు 100 రూపాయలు వారం రోజుల పాటు పెంచుకోవచ్చు అని, బెనిఫిట్ షోకు 200 పెంచొచ్చు అని, అలాగే రోజుకు 5 ఆటలు వేసుకోవచ్చని అనుమతులు ఇచ్చారు. తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా కల్కి సినిమాకు టికెట్ రేట్ల పెంపుకు ఆమోదం తెలిపింది. ఏపీలో రెండు వారాల పాటు సింగిల్ స్క్రీన్స్ లో 75 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 125 రూపాయలు పెంచుకోవచ్చు అని, అలాగే రోజుకు 5 ఆటలు వేసుకోవచ్చు అని ఏపీ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది.

Also Read : Jani Master : జానీ మాస్టర్ సెన్సేషనల్ ప్రెస్ మీట్.. తనపై వచ్చిన ఆరోపణలపై క్లారిటీ..

దీంతో భారీ ఓపెనింగ్స్ వస్తాయని మూవీ యూనిట్ భావిస్తుంది. అయితే టికెట్ రేట్లు భారీగా పెంచారని కొంతమంది మాత్రం విమర్శలు చేస్తున్నారు. మినిమమ్ 500 లేకుండా మల్టీప్లెక్స్ లో టికెట్ వచ్చేలా లేదని అభిప్రాయపడుతున్నారు. మరి ఈ టికెట్ రేట్లు కల్కి సినిమాకు ఏ రేంజ్ కలెక్షన్స్ తెస్తాయో చూడాలి.