Project K : ప్రాజెక్ట్ K నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ వచ్చేసింది.. జటాజూటధారిగా ఇండియన్ సూపర్ హీరో..

తాజాగా ప్రాజెక్ట్ K సినిమా పైనుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి అభిమానులని ఆశ్చర్యపరిచారు చిత్రయూనిట్.

Project K : ప్రాజెక్ట్ K నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ వచ్చేసింది.. జటాజూటధారిగా ఇండియన్ సూపర్ హీరో..

Prabhas first Look released from Project K first look goes viral and Trending

Updated On : July 19, 2023 / 4:08 PM IST

Prabhas First Look : నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ K. వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే (Deepika Padukone), దిశా పఠాని, కమల్ హాసన్.. ఇలా స్టార్ క్యాస్ట్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ అమెరికా కాలిఫోర్నియాలోని San Diegoలో నిర్వహించే ప్రతిష్టాత్మక ఈవెంట్ కామిక్ కాన్ లో రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.

Bro Movie : బ్రో స్పెషల్ షోస్, టికెట్స్ రేట్ పెంపు లేదు.. ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. పవన్ వస్తున్నాడా..?

ఈ ఈవెంట్ లో పాల్గొనబోయే మొదటి ఇండియన్ సినిమాగా ప్రాజెక్ట్ K సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. ఈ కార్యక్రమానికి దర్శక నిర్మాతలతో పాటు ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొనే పాల్గొనబోతున్నట్లు నిర్మాతలు ఆల్రెడీ తెలిపారు. అయితే వీరితో పాటు రానా కూడా పాల్గొనబోతున్నాడు. ఇప్పటికే ప్రభాస్, రానా, కమల్ హాసన్, చిత్రయూనిట్ అమెరికాకు చేరుకున్నట్టు హాలీవుడ్ నుంచి ఓ ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఫ్యాన్స్ కి సర్‌ప్రైజ్ కూడా ఇచ్చారు.

Jeevitha Rajasekhar : జీవితా, రాజశేఖర్‌లకు జైలు శిక్ష.. బెయిల్ మంజూరు

తాజాగా ప్రాజెక్ట్ K సినిమా పైనుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి అభిమానులని ఆశ్చర్యపరిచారు చిత్రయూనిట్. ఈ లుక్ లో ప్రభాస్ లాంగ్ హెయిర్ తో జటాజూటధారిగా కనిపిస్తూనే, సూపర్ హీరో సూట్ ధరించి మోడరన్ లుక్ లో అదరగొడుతున్నాడు. గతంలోనే ఈ చిత్ర నిర్మాత అశ్వినీ దత్ ఈ మూవీ.. మోడరన్ విష్ణుమూర్తి కథతో రాబోతుందని, అలాగే సైన్స్ ఫిక్షన్ గా కూడా ఉండబోతుందని తెలియజేశారు. ఇప్పుడు ఈ పోస్టర్ కూడా అదే కాన్సెప్ట్ తో ఉండడంతో ఆడియన్స్ ఒక కొత్త సినిమాని చూడబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.