Prabhas Hanu
Prabhas Hanu : ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. త్వరలో రాజాసాబ్ సినిమాతో రాబోతున్నాడు. ఆ తర్వాత హను రాఘవపూడి సినిమాతో రానున్నాడు. ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్ వినిపిస్తుంది. ఆర్మీ, యుద్ధం బ్యాక్ డ్రాప్ లో ఒక మంచి ప్రేమకథతో ఈ సినిమా రాబోతున్నట్టు తెలుస్తుంది.(Prabhas Hanu)
ప్రభాస్ – హను రాఘవపూడి సినిమా ఓపెనింగ్ తప్ప ఇప్పటిదాకా ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజాగా ఈ సినిమా నుంచి దీపావళి సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి ఓ అప్డేట్ కూడా ఇచ్చారు. ఈ పోస్టర్ లో ప్రభాస్ నీడ కనిపిస్తుండగా తుపాకులు అన్ని ఆ నీడకు గుచ్చినట్టు ఉంది. ఆ పోస్టర్ కి తగ్గట్టు.. యుద్ధంలో సింగిల్ గా నిల్చున్నవాడు అనే కొటేషన్ ఇచ్చారు. అలాగే పద్మవ్యూహంలో విజయ పార్థ అనే హిందీ కొటేషన్ తో ఈ పోస్టర్ ని రిలీజ్ చేసారు.
Also Read : Ram Pothineni : క్యాస్ట్ గొడవల్లో మొత్తం ఆస్తి పోగొట్టుకున్న రామ్ ఫ్యామిలీ.. దాంతో ఊరు వదిలేసి..
ఇక ప్రభాస్ హను సినిమా అప్డేట్ అక్టోబర్ 22న ఇస్తామని ప్రకటించారు. దీంతో ఆ రోజు ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్ ప్రకటిస్తారని ఊహిస్తున్నారు. ఒక్క పోస్టర్ తోనే సినిమాపై ఆసక్తి పెంచడంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
———————-
पद्मव्यूह विजयी पार्थः
———————-#PrabhasHanu DECRYPTION BEGINS ON 22.10.25 🔥Happy Diwali ✨
Rebel Star #Prabhas #Imanvi @hanurpudi #MithunChakraborty #JayaPrada @AnupamPKher @Composer_Vishal @sudeepdop @kk_lyricist @MrSheetalsharma… pic.twitter.com/TDUXpaSmZW
— Mythri Movie Makers (@MythriOfficial) October 20, 2025
Also Read : Chiranjeevi : 24 ఏళ్ళ తర్వాత మళ్ళీ అలాంటి పాత్రలో మెగాస్టార్..? పండక్కి ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోషన్ కూడా..