×
Ad

Fauzi : ప్ర‌భాస్‌-హ‌ను మూవీ టైటిల్ ఇదే.. ఫ‌స్ట్‌లుక్ అదుర్స్‌..

హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఓ చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి ఫౌజీ (Fauzi) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.

Prabhas Hanu Raghavapudi movie name is Fauzi

Fauzi : హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఓ చిత్రంలో న‌టిస్తున్నారు. కొత్త అమ్మాయి ఇమాన్వి క‌థానాయిక‌గా న‌టిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యాన‌ర్ పై ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి లు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు.

Prabhas Rare Photos : ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. ప్రభాస్ పాత ఫొటోలు.. రెబల్ స్టార్ రేర్ ఫొటోలు చూశారా..?

కాగా.. నేడు ప్ర‌భాస్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ఈ చిత్ర టైటిల్‌ను రివీల్ చేశారు. ఈ చిత్రానికి ఫౌజీ (Fauzi) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ, ఈ చిత్రంలో ప్ర‌భాస్ ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు.

‘పద్మవ్యూహాన్ని ఛేదించిన అర్జునుడు.. పాండవుల పక్షాన ఉన్న కర్ణుడు.. గురువు లేని ఏకలవ్యుడు.. పుట్టకతోనే అతడు ఓ యోధుడు.. మన చరిత్రలో దాగిన అధ్యాయాల్లోని అత్యంత ధైర్యవంతుడైన సైనికుడి కథ ఇది. అతడే ఫౌజీ.’ అంటూ ప్ర‌భాస్ గొప్ప ద‌నాన్నిచెప్పుకొచ్చింది.

ఇందులో ప్ర‌భాస్ చాలా సీరియ‌స్‌గా చూస్తున్న‌ట్లుగా ఉన్నాడు. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.