Prabhas : షూటింగ్ లో ప్రభాస్ కు గాయం.. ఆందోళనలో ఫ్యాన్స్.. జపాన్ పర్యటన రద్దు..

ప్రస్తుతం ప్రభాస్ జపాన్ పర్యటన రద్దు అయినట్టు సమాచారం.

Prabhas Injured in Movie Shooting Japan Tour Cancelled

Prabhas : ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో, వరుస భారీ సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం కల్కి లాంటి పెద్ద హిట్ కొట్టిన ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. అయితే ప్రభాస్ కల్కి సినిమా జపాన్ లో జనవరి 3న రిలీజ్ కానుంది. జపాన్ లో తెలుగు సినిమాలకు, ముఖ్యంగా ప్రభాస్ కు ఫ్యాన్స్ ఎక్కువ అని తెలిసిందే. దీంతో జపాన్ సినిమా రిలీజ్ కి ముందు ప్రభాస్ అక్కడ ప్రమోషన్స్ లో పాల్గొంటారని ప్రకటించారు.

కానీ ప్రస్తుతం ప్రభాస్ జపాన్ పర్యటన రద్దు అయినట్టు సమాచారం. ప్రభాస్ ఫౌజీ సినిమా షూటింగ్ లో గాయపడినట్టు తెలుస్తుంది. యాక్షన్ సీక్వెన్స్ లో కాలికి గాయం అయినట్టు సమాచారం. దీంతో ప్రభాస్ కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాల్సి రావడంతో జపాన్ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ విషయం జపాన్ కల్కి సినిమా డిస్ట్రిబ్యూటింగ్ సంస్థ తన సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు.

Also Read : Bhanushree Mehra : అల్లు అర్జున్ హీరోయిన్ ఇంట తీవ్ర విషాదం..

జపాన్ డిస్ట్రిబ్యూటింగ్ సంస్థ ట్విన్.. ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ సందర్భంగా ప్రమోషన్స్ కోసం డిసెంబర్ 18న జపాన్ కి రావాల్సి ఉంది. కానీ ఓ సినిమా షూటింగ్ లో ప్రభాస్ కాలికి గాయం అవ్వడంతో ప్రభాస్ జపాన్ పర్యటన రద్దు అయింది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాత్రం జపాన్ కి రానున్నారు. డిసెంబర్ 18న కల్కి ప్రీమియర్స్ లో నాగ్ అశ్విన్ పాల్గొననున్నారు అని జపాన్ భాషలో తెలిపారు. దీంతో ఈ వార్త వైరల్ గా మారడంతో అభిమానులు ప్రభాస్ కి ఏం జరిగింది?, త్వరగా కోలుకోవాలి అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ జపాన్ ఫ్యాన్స్ కూడా ప్రభాస్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.