Prabhas is being trolled worldwide for the work done by Netflix
Prabhas: టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి వరల్డ్ వైడ్‌గా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఈ హీరో నటిస్తున్న తదుపరి సినిమాలు ఆదిపురుష్, సాలార్, ప్రాజెక్ట్-K సినిమాలు కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కాగా ప్రస్తుతం ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ “నెట్‌ఫ్లిక్స్” ప్రభాస్ అభిమానుల కోపానికి కారణమవుతుంది. ఎందుకంటే ఆ సంస్థ చేసిన ఒక అత్యుత్సాహ పనికి ప్రభాస్ వరల్డ్ వైడ్ గా ట్రోలింగ్ కి గురవుతున్నాడు.
బాహుబలి వంటి విజయాన్ని అందుకున్న తరువాత ప్రభాస్ నుంచి వచ్చిన యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం “సాహో”. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోకపోయిన, డార్లింగ్ కెరీర్ లో ఒక స్టైలిష్ మూవీగా నిలిచిపోయింది. ఇక చెప్పాలంటే ఈ సినిమాలోని యాక్షన్స్ సీన్స్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమాలోని ఒక యాక్షన్ క్లిప్‌ని ‘నెట్‌ఫ్లిక్స్ ఇండోనేషియా’ హాస్యాస్పదంగా ట్వీట్ చేస్తూ షేర్ చేసింది.
సాహో ఇంటర్వెల్ తరువాత ప్రభాస్ కొండపై నుండి పారాచూట్‌తో బాంజాయ్ స్కైడైవింగ్ చేసే క్లిప్‌ని షేర్ చేస్తూ “ఇది ఎటువంటి యాక్షన్ సీన్” అంటూ సెటైరికల్‌గా వ్యాఖ్యానించింది. హాస్యం కోసం నెట్‌ఫ్లిక్స్ ఇండోనేషియా చేసిన పని ప్రభాస్ అభిమానులకు అంతగా నచ్చలేదు. దీంతో ఆగ్రహించిన ఫ్యాన్స్ నెట్‌ఫ్లిక్స్ ని వారి ఫోన్లో నుంచి తొలిగించడమే కాకుండా #UnsubscribeNetflix అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. దీని కారణంగా నెట్‌ఫ్లిక్స్ ఇండియా చిక్కుల్లో పడింది. మారి అభిమానుల కోపం తగ్గించడానికి ఆ సంస్థ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
Kamu NeeenYha ini akSi apAa? pic.twitter.com/RoWaMNYGIT
— Netflix Indonesia (@NetflixID) November 2, 2022
Seeing #UnsubscribeNetflix is trending. I think someone at @NetflixID is going to get fired. ?
(Trolling a big star like #Prabhas with a big fan following and a film @netflix paid big money for is not a good idea)— Asjad Nazir (@asjadnazir) November 5, 2022