Prabhas : ఆ బాలీవుడ్ డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా ఫిక్స్?? ప్రభాస్ చేతిలో మొత్తం ఆరు సినిమాలు.. ఎప్పటికి అయ్యేనో??

పాన్ఇండియా స్టార్ ప్రభాస్ కి ప్రపోజల్స్ ఎక్కువైపోయాయి. లేటెస్ట్ గా వార్, పఠాన్ లాంటి సినిమాలు చేసిన బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సిద్దార్ద్ ఆనంద్ తో ప్రభాస్ సినిమా చేస్తున్నాడంటూ టాక్ నడుస్తోంది. వార్ 2 లో ప్రభాస్ చేస్తున్నాడన్న టాక్ ఎప్పటినుంచో...............

Prabhas : ఆ బాలీవుడ్ డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా ఫిక్స్?? ప్రభాస్ చేతిలో మొత్తం ఆరు సినిమాలు.. ఎప్పటికి అయ్యేనో??

Prabhas ok to movie with bollywood director siddarth anand

Prabhas :  ఇండియాలో ఎవరికీ లేనంత మార్కెట్, ఎవరికీ లేనంత క్రేజ్, ఎవరికీ లేనంత ఇమేజ్.. ఇవన్నీ పాన్ ఇండియాస్టార్ ప్రభాస్ సొంతం. వీటితో పాటు ఎవరికీ లేనన్ని మూవీ ప్రపోజల్స్ కూడా ప్రభాస్ సొంతమవుతున్నాయి. ఇప్పటికే 5 సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఎప్పట్నుంచో అనుకుంటున్న బాలీవుడ్ టాప్ డైరెక్టర్ తో మరో సినిమాకి ఓకే చెప్పారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చేతిలో 5 సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ లేటెస్ట్ గా 6వ సినిమా సైన్ చేసే పనిలో ఉన్నారని బాలీవుడ్ మీడియా టాక్.

 

పాన్ఇండియా స్టార్ ప్రభాస్ కి ప్రపోజల్స్ ఎక్కువైపోయాయి. లేటెస్ట్ గా వార్, పఠాన్ లాంటి సినిమాలు చేసిన బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సిద్దార్ద్ ఆనంద్ తో ప్రభాస్ సినిమా చేస్తున్నాడంటూ టాక్ నడుస్తోంది. వార్ 2 లో ప్రభాస్ చేస్తున్నాడన్న టాక్ ఎప్పటినుంచో నడుస్తున్నా లేటెస్ట్ గా మరోసారి ఈ భారీ మల్టీస్టారర్ లైమ్ లైట్లోకి వచ్చింది. ప్రభాస్ స్టామినాకి, ఆయన క్రేజ్ కి తగ్గట్లు అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ తీసి ప్రభాస్ ని హాలీవుడ్ రేంజ్ లో ప్రొజెక్ట్ చేసేలా సిద్దార్ద్ ప్లాన్ చేస్తున్నారని న్యూస్. అయితే అసలు ఈ సినిమా తెరకెక్కే ఛాన్సుందా అని ఆలోచనలోపడ్డారు జనాలు.

ప్రభాస్ ఇప్పటికే 5 సినిమాలతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ తో 400కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సంక్రాంతి రిలీజ్ కు రెడీ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఇప్పటి వరకూ ప్రభాస్ టచ్ చెయ్యని జానర్ తో పాటు మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో 3డీలో తెరకెక్కుతున్న ఆదిపురుష్ ప్రభాస్ ని సరికొత్తగా ఆడియన్స్ కి చూపించబోతోంది. ఆదిపురుష్ షూటింగ్ కంప్లీట్ చేసేసిన ప్రభాస్ ప్రశాంత్ నీల్ తో సలార్ మూవీ చేస్తున్నారు. కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.

Hansika : హన్సిక కాబోయే భర్తకి ఆల్రెడీ పెళ్లి అయిపోయిందా.. అది కూడా హన్సిక ఫ్రెండ్ తోనే??

నాగ్ అశ్విన్ తో ప్రభాస్ సైఫై ఎంటర్ టైనర్ ప్రాజెక్ట్ K చేస్తున్నారు. పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ మూవీ అంటూ ఇప్పటికే హైప్స్ పెంచేసిన ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాల షూటింగ్ తో షటిల్ సర్వీస్ చేస్తున్న ప్రభాస్ ఈ భారీ సినిమాల నుంచి బ్రేక్ తీసుకుని మారుతితో హార్రర్ యాక్షన్ కామెడీ మూవీ చేస్తున్నారని వినిపిస్తోంది. ఇక ప్రభాస్ 25వ మూవీని సందీప్ రెడ్డి వంగాతో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. స్పిరిట్ టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా ఆల్రెడీ లైన్లో ఉంది. ఇలా 5 సినిమాలతో పీకల్లోతు బిజీగా ఉన్న ప్రభాస్ సిద్దార్ద్ ఆనంద్ తో సినిమా చేసేదెప్పడు? అసలు ఉన్న సినిమాలు కంప్లీట్ చేసి కొత్త సినిమా సెట్స్ మీదకి వెళ్లాలంటే కనీసం రెండేళ్లు పడుతుంది. అప్పటిదాకా దీనిపై ఆశలు లేవు ప్రభాస్ ఫ్యాన్స్ కి. ఇప్పటికే లైన్లో ఉన్న సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.