Kalki 2898 AD : కల్కిలో ప్రభాస్ మూడు పాత్రలు..? పాస్ట్.. ప్రెజెంట్.. ఫ్యూచర్..!

కల్కిలో ప్రభాస్ మూడు పాత్రల్లో కనిపించబోతున్నారా..? పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ మూడు టైం పీరియడ్స్‌లో..

Prabhas is really doing three different roles in Kalki 2898 AD

Kalki 2898 AD : ప్ర‌భాస్ న‌టిస్తున్న సైన్స్ ఫిక్ష‌న్ యాక్షన్ థ్రిల్ల‌ర్‌ సినిమా ‘కల్కి 2898 AD’. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో లోక‌నాయ‌కుడు కమల్‌ హాసన్‌ విల‌న్‌గా క‌నిపించ‌నుండ‌గా దీపికా పదుకొనే, దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు. కాగా ఈ మూవీలో ప్రభాస్ మోడరన్ విష్ణుమూర్తిగా కనిపించబోతున్నారని నిర్మాత అశ్వినీ దత్ వెల్లడించిన సంగతి తెలిసిందే.

దీంతో ఈ మూవీలో ప్రభాస్ ఎలా కనిపించబోతున్నారో అని అందరిలో ఆసక్తి మొదలైంది. ఇటీవల కల్కి మూవీ సెట్స్‌లో నెట్‌ఫ్లిక్స్ సీఈఓ ప్రభాస్ తో ఉన్న ఫోటో ఒకటి బయటకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ పిక్ లో ప్రభాస్ గుబురు గడ్డంతో కొత్త లుక్ లో కనిపించారు. దీంతో మూవీలో ఆయన లుక్స్ పై మరింత క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది. తాజాగా ప్రభాస్ పాత్రలకి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది.

Also read : Murali Mohan : మనవరాళ్ల పెళ్లిళ్లు గురించి మాట్లాడిన మురళీ మోహన్.. కీరవాణి కొడుకుతో పెళ్లి..

ఈ సినిమాలో ప్రభాస్ మొత్తం మూడు పాత్రల్లో కనిపించబోతున్నారట. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ మూడు టైం పీరియడ్స్ లో డిఫరెంట్ గెటప్స్ లో ప్రభాస్ కనిపించబోతున్నారట. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు గాని, ప్రస్తుతం ఈ వార్త అయితే వైరల్ గా మారింది. వైజయంతి బ్యానర్స్ పై అశ్వినీ దత్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2024 సంక్రాంతికి రిలీజ్ చేస్తామంటూ ప్రకటించినప్పటికీ.. గ్రాఫిక్స్ వర్క్స్ పూర్తి కాకా రిలీజ్ ని వాయిదా వేశారు.

మరి ఈ చిత్రాన్ని ఎప్పుడు పూర్తి చేసి ఎప్పుడు ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తారో చూడాలి. కాగా ఈ సినిమా ఒకటి కంటే ఎక్కువ భాగాలుగా తెరకెక్కుతోందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సలార్ కూడా రెండు భాగాలుగా వస్తుంది. మరి కల్కి ఎన్ని భాగాలుగా వస్తుందో. సంతోష్ నారాయణ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.