Murali Mohan : మనవరాళ్ల పెళ్లిళ్లు గురించి మాట్లాడిన మురళీ మోహన్.. కీరవాణి కొడుకుతో పెళ్లి..

రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మురళీ మోహన్ మాట్లాడుతూ.. తన ఇద్దరి మనవరాళ్ల పెళ్లిళ్లు గురించిన వివరాలను తెలియజేశారు. కీరవాణి కొడుకుతో పెళ్లి అనే వార్త..

Murali Mohan : మనవరాళ్ల పెళ్లిళ్లు గురించి మాట్లాడిన మురళీ మోహన్.. కీరవాణి కొడుకుతో పెళ్లి..

Murali Mohan comments about his grand daughter marriage with keeravani son

Updated On : December 14, 2023 / 8:58 AM IST

Murali Mohan : టాలీవుడ్ నటుడు మురళీ మోహన్.. తన మనవరాలిని మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఇంటికి కోడలిగా పంపించడానికి సిద్దమయ్యారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయం పై మురళీ మోహన్ స్పందించారు. రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మురళీ మోహన్ మాట్లాడుతూ.. తన ఇద్దరి మనవరాళ్ల పెళ్లిళ్లు గురించిన వివరాలను తెలియజేశారు. మురళీ మోహన్‌కి.. అమ్మాయి మధు బిందు, అబ్బాయి రామ్ మోహన్ ఇద్దరు పిల్లలు ఉన్నారు.

కొడుకు ఇక్కడే బిజినెస్ మెన్ గా కొనసాగుతున్నారు. కూతురు మధు బిందు అమెరికాలో స్థిరపడ్డారని, ఆమె భర్త అక్కడ డాక్టర్ గా చేస్తున్నారని మురళీ మోహన్ తెలియజేశారు. కాగా మధు బిందు, రామ్ మోహన్ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఈ ఇద్దరి మ్యారేజ్స్ ని నెక్స్ట్ ఇయర్ చేయబోతున్నారట. మధు బిందు కూతురి వివాహం 2024 ఫిబ్రవరి 14న జరగబోతుందట. ఇది ఇంటర్ కాంటినెంటల్ మ్యారేజ్ అని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు. ఫిలిప్పీన్స్ నుంచి అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడిన ఒక కుటుంబంలోకి మధు బిందు కూతురు కోడలిగా వెళ్లబోతుందట. హైదరాబాద్‌లోనే ఈ వివాహం జరగనుంది.

Also read : Animal Movie : ‘యానిమల్‌’పై జయప్రకాశ్ నారాయణ్ కామెంట్స్.. సినిమా మేకర్స్‌కి భాద్యత ఉండాలి..

ఇక రామ్ మోహన్ కుమార్తెని కీరవాణి కొడుకుకి ఇచ్చి పెళ్లి చేస్తున్న మాట నిజమే అని తెలియజేశారు. ఈ వివాహం వచ్చే ఏడాది చివరిలో జరగబోతుందట. కీరవాణి రెండో కొడుకు ‘సింహా’కి మురళీ మోహన్ తన మనవరాలిని ఇచ్చి పెళ్లి చేయబోతున్నారు. ప్రస్తుతం సింహా ఇండస్ట్రీలో హీరోగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. అయితే కీరవాణి మొదటి కొడుకు కాల భైరవకి ఇంకా పెళ్లి కాలేదు. మరి కీరవాణి ఈలోపు కాల భైరవ పెళ్లి కూడా ఫిక్స్ చేసేస్తారా..? లేదా పెద్ద కొడుకు కంటే ముందే చిన్న కొడుకు పెళ్లి చేస్తారా అనేది చూడాలి. కాగా కాల భైరవ ప్రస్తుతం ఇండస్ట్రీలో సింగర్ గా రాణిస్తున్నారు.