Kalki 2898 AD Teaser : ప్రభాస్ ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్.. కల్కి టీజర్ రాబోతుందట.. సర్టిఫికేషన్ కూడా పూర్తి..

కల్కి రిలీజ్ డేట్ తో పాటు టీజర్ ని కూడా ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేశారట. ప్రస్తుతం ఆ టీజర్ సర్టిఫికేషన్ డాక్యుమెంట్..

Prabhas Kalki 2898 AD movie released date comes with teaser

Kalki 2898 AD Teaser : ప్రభాస్ ని సూపర్ హీరోగా చూపిస్తూ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఫ్యూచరిస్టిక్ మూవీ ‘కల్కి 2898AD’. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా చిత్రీకరణ చివరిదశలో ఉందని సమాచారం. కాగా ఈ సినిమా ఈ సంక్రాంతి పండక్కే రావాల్సింది. కానీ గ్రాఫిక్స్ వర్క్ ఆలస్యం అవ్వడంతో వాయిదా పడింది. ఇక కొత్త రిలీజ్ డేట్ ని ఈ పండక్కి అనౌన్స్ చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు.

మూవీ రిలీజ్ అనౌన్స్‌మెంట్ ని కూడా కొత్తగా ప్లాన్ చేసిన మేకర్స్.. ఓ టైమర్ ఫిక్స్ చేశారు. ఈ టైమర్ బట్టి ఆ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ జనవరి 13న రాబోతుంది. కాగా ఈ న్యూ రిలీజ్ డేట్ ప్రటనతో పాటు టీజర్ ని కూడా ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారట మేకర్స్. ఈ టీజర్ కి సంబంధించిన ఓ సర్టిఫికేషన్ డాక్యుమెంట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఈ చిత్ర నిర్మాత అశ్వనీదత్ నేడు టీజర్ కి సర్టిఫికేషన్ తీసుకున్నారు. దాదాపు 1 నిమిషం 23 సెకెన్ల నిడివితో ఈ టీజర్ ఉండబోతుందని ఆ సర్టిఫికెట్ లో కనిపిస్తుంది.

Also read : #90’s Review : 90’s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ రివ్యూ..

అయితే ఈ టీజర్ వార్త గురించి మూవీ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. కాగా ఈ సినిమాని వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంస్థ నుంచి వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి, మహానటి, మహర్షి సినిమాలు మే 9న రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ ని అందుకున్నాయి. ఇప్పుడు కల్కి ని కూడా ఆ డేట్ లోనే రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

కాగా ఈ సినిమాలో కమల్‌ హాసన్‌ విలన్ గా నటిస్తుంటే దీపికా పదుకొనే, దిశా పటాని, అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రల్లో చేస్తున్నారు. ఈ సినిమాలో వాడే టెక్నాలజీ, ఆయుధాలు, ట్రోప్స్, కాస్ట్యూమ్స్.. ఇలా ప్రతిది భవిష్యత్ లో ఎలా మార్పు చెందే అవకాశం ఉండనే అంశం పైన ప్రత్యేక శ్రద్ద తీసుకున్నాము. ఆ డిజైన్స్ ని భారతీయ మూలాలతో డిజైన్ చేశారట. తెరపై అది అద్భుతంగా కనిపిస్తుందని నాగ్ అశ్విన్ తెలియజేశారు.