Kalki Theatrical Business : ‘కల్కి’ థియేట్రికల్ బిజినెస్ ఎంత జరిగింది? హిట్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలి..?

తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశం మొత్తం, ఓవర్సీస్ కూడా భారీ ధరకు కల్కి సినిమా థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయి.

Kalki Theatrical Business : ప్రభాస్ కల్కి సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ చేసిన రెండు ట్రైలర్స్ తో సినిమాపై భారీ ఆంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమా ఉండబోతుందని, సినిమాలో చాలా మంది స్టార్స్ ఉన్నారని కల్కి సినిమాని థియేటర్స్ లో చూడటానికి ఎదురుచూస్తున్నారు అందరూ. కల్కి సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో థియేట్రికల్ బిజినెస్ కూడా బాగా జరిగింది. ఈ సినిమా జూన్ 27న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.

తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశం మొత్తం, ఓవర్సీస్ కూడా భారీ ధరకు కల్కి సినిమా థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయి. టాలీవుడ్ సమాచారం ప్రకారం.. కల్కి సినిమా థియేట్రికల్ హక్కులు నైజాంలో 70 కోట్లకు, సీడెడ్ లో 25 కోట్లకు, ఉత్తరాంధ్రలో 25 కోట్లకు, ఈస్ట్ – వెస్ట్ కలిపి 26 కోట్లకు, గుంటూరు 12 కోట్లకు, కృష్ణా 14 కోట్లకు, నెల్లూరు 7 కోట్లకు అమ్ముడుపోయాయి. ఇక కర్ణాటక 27 కోట్లకు, తమిళనాడు 15 కోట్లకు, కేరళ 5 కోట్లకు, హిందీ నార్త్ మొత్తం 85 కోట్లకు అమ్ముడయ్యాయి. ఓవర్సీస్ అన్ని కలిపి దాదాపు 70 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడైనట్టు సమాచారం.

Also Read : Klin Kaara : మేనత్తతో క్లిన్ కారా.. చరణ్ కూతురు ఫస్ట్ బర్త్‌డే ఫొటోలు.. ఇప్పటికి కూడా ఫేస్ చూపించట్లేదుగా..

ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే మొత్తం 179 కోట్లకు కల్కి థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి. అంటే కనీసం తెలుగు రాష్ట్రాల్లో 360 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయాలి. ఇక ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమా మొత్తం దాదాపు 380 కోట్లకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కల్కి సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 385 కోట్ల షేర్ కలెక్షన్స్ అంటే 770 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రావాలి. ఇక మూవీ యూనిట్ అయితే ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల కలెక్షన్స్ టార్గెట్ పెట్టుకొని దిగుతుంది. మొదటి వారం టికెట్ ప్రైజ్ పెంచడానికి ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను మూవీ టీమ్ విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. మరి కల్కి సినిమా ఏ రేంజ్ లో హిట్ అయి ఎన్ని కలెక్షన్స్ తెస్తుందో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు