రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్‌తో సుజీత్ తెరకెక్కిస్తున్న చిత్రం సాహో. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు తేనున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్‌తో సుజీత్ తెరకెక్కిస్తున్న చిత్రం సాహో. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు తేనున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ఇటీవల విడుదలైన మేకింగ్ వీడియోలు సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నాయి. ఇక ఈ చిత్రం యొక్క షూటింగ్ తుది దశకు చేరుకుంది. భారీ విఎఫ్ఎక్స్ తో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనెర్ లో బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.
బాహుబలి చిత్రంతో ప్రభాస్‌కి జపాన్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆయన పోస్టర్స్‌ని ఇంట్లో పెట్టుకోవడం, ప్రభాస్ బర్త్ డే ఘనంగా సెలబ్రేట్ చేయడం లాంటివి చేస్తున్నారు అక్కడి ప్రజలు. ఇప్పటికే ఈ చిత్రం యొక్క డిస్ట్రిబ్యూషన్ హక్కులు కూడా భారీ ధరకు అమ్ముడైయ్యాయని సమాచారం. అయితే ఒకే సారి కాకుండా ఇండియాలో విడుదలైన తరువాతే ఈ చిత్రం అక్కడ విడుదల కానుంది.
Read Also : ఉగాది స్పెషల్: రాక్షసుడు ఫస్ట్‌లుక్ విడుదల