Kalki Collections : 1000 కోట్ల కల్కి.. కర్ణుడి పోస్టర్ అదిరిందిగా.. రెండోసారి ప్రభాస్ సరికొత్త రికార్డ్..

కలెక్షన్స్ విషయంలో కూడా కల్కి సినిమా బాక్సాఫీస్ దగ్గర సునామి సృష్టిస్తుంది.

Prabhas Nag Ashwin Kalki 2898AD Movie Collects 1000 Crores Gross and Creates New Records

Kalki Collections : నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ప్రభాస్ కల్కి సినిమా థియేటర్స్ లో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. సినిమాలో విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ లు ప్రేక్షకులకు బాగా నచ్చేసాయి. ఇక కలెక్షన్స్ విషయంలో కూడా కల్కి సినిమా బాక్సాఫీస్ దగ్గర సునామి సృష్టిస్తుంది. కల్కి సినిమా మొదటి రోజు 191 కోట్ల గ్రాస్ వసూలు చేయగా 16 రోజులకు 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్టు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

Also Read : Director Shankar : డైరెక్టర్ శంకర్‌కి ఏమైంది? శంకర్ సినిమాల్లో మ్యాజిక్ మిస్ అవ్వడానికి కారణాలేంటి?

కల్కి సినిమాలో ప్రభాస్ కాసేపు కర్ణుడిలా కనిపించిన సంగతి తెలిసిందే. ఆ కాసేపు విజువల్స్ కే ఫ్యాన్స్, ప్రేక్షకులు షాక్ అయ్యారు. నేడు మూవీ యూనిట్ ప్రభాస్ కర్ణుడి గెటప్ లో ఉన్న పోస్టర్ తో 1000 కోట్ల కలెక్షన్స్ పోస్టర్ అధికారికంగా రిలీజ్ చేయడంతో అభిమనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ పోస్టర్ కూడా వైరల్ గా మారింది.

ఇప్పటికే కల్కి సినిమా అనేక రికార్డులని కొల్లగొట్టింది. ప్రభాస్ బాహుబలి నుంచి ప్రతి సినిమాతో కొన్ని రికార్డులని సెట్ చేస్తూనే వస్తున్నాడు. ఈ కల్కి తో కూడా అనేక రికార్డులు సెట్ చేసాడు ప్రభాస్. రెండు సినిమాలు 1000 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఏకైక సౌత్ హీరోగా ప్రభాస్ నిలిచాడు. బాహుబలి 2 తర్వాత కల్కి 1000 కోట్లు సాధించింది. ఈ విషయంలో ప్రభాస్ షారుఖ్ ని సమం చేసాడు. ఇక కల్కి సినిమా అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయి ఫుల్ ప్రాఫిట్స్ తో దూసుకుపోతుంది.