Prabhas : ప్రభాస్ పేరు మారింది గమనించారా? జ్యోతిష్యమా? న్యూమరాలజీనా?

మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రభాస్ సినిమాకు రాజాసాబ్(RajaSaab) అనే టైటిల్ ని నిన్నే సంక్రాంతి కానుకగా ప్రకటించారు.

Prabhas Name Changed as Prabhass in Rajasaab Poster Details Here

Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవలే సలార్(Salaar) సినిమాతో భారీ హిట్ కొట్టాడు. బాహుబలి(Bahubali) తర్వాత మళ్ళీ ఆ రేంజ్ హిట్ కొట్టడం ఇదే. సలార్ సినిమా దాదాపు 650 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. సలార్ విజయంపై చిత్రయూనిట్ తో పాటు అభిమానులు కూడా సంతోషంగా ఉన్నారు. ఇక ప్రభాస్ నెక్స్ట్ సినిమాల లైనప్ కూడా పెద్దగానే ఉంది. ఈ సమ్మర్ కి కల్కి సినిమాతో రాబోతున్నాడు. ఆ తర్వాత రాజాసాబ్ సినిమాతో రాబోతున్నాడు.

మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రభాస్ సినిమాకు రాజాసాబ్(RajaSaab) అనే టైటిల్ ని నిన్నే సంక్రాంతి కానుకగా ప్రకటించారు. ఈ సినిమాలో వింటేజ్ ప్రభాస్ ని చూపిస్తాను అని అంటున్నాడు మారుతీ. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టర్ లో ఉన్న ప్రభాస్ పేరు ఇప్పుడు వైరల్ గా మారింది. ఇన్ని రోజులు ప్రభాస్ పేరుని ఇంగ్లీష్ లో ‘Prabhas’ అని రాసేవారు. అయితే రాజా సాబ్ పోస్టర్ మీద ‘Prabhass’ అని రాశారు. ప్రభాస్ పేరుకి ఇంగ్లీష్ లో ఒక S ఎక్స్ట్రా గా జత చేశారు.

Also Read : Akira Nandan : ఎమోషనల్ సాంగ్ ప్లే చేసిన అకిరా.. నాన్న కోసమేనా.. పవన్ తనయుడు ఎప్పటికైనా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాల్సిందే..

దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎవరైనా న్యూమరాలజిస్ట్ చెప్తే మార్చుకున్నారా? లేదా జ్యోతిష్యులు ఎవరైనా చెప్పారా? అసలు ఎక్స్ట్రా లెటర్ ఎందుకు పెట్టారు? ప్రభాస్ కెరీర్ బాగుండాలనా? హిట్స్ రావాలనా? అని అభిమానులు, నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇక కొంతమంది అయితే పోస్టర్ డిజైన్ చేసేవాడు తప్పుగా ఒక లెటర్ ఎక్స్ట్రా పెట్టాడా అని కూడా అంటున్నారు. మొన్న సలార్ కి కూడా ‘Prabhas’ అనే పడింది. రాబోయే కల్కి సినిమాకి కూడా ‘Prabhas’ అనే పెట్టారు. మరి ఇప్పుడు రాజా సాబ్ సినిమాకి ‘Prabhass’ అని ఎందుకు మార్చారో? మొత్తానికి ప్రభాస్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.