Prabhas : ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ షూటింగ్ లో బిజీ ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రభాస్ కొత్త లుక్ వైరల్ అవుతుంది. ప్రభాస్ నిన్న ముంబై వెళ్లిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రాజా సాబ్ షూటింగ్ లో ప్రభాస్ పాత్ర షూట్ పూర్తవ్వడంతో నెక్స్ట్ చేయబోయే హను రాఘవపూడి సినిమా లుక్ టెస్ట్ కోసం ప్రభాస్ ముంబైకు వెళ్లాడని సమాచారం.
ప్రభాస్, ఇమాన్వి జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో కొత్త సినిమా ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. యుద్ధం బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీ అని, సినిమా టైటిల్ ఫౌజీ అని ఇప్పటికే టాలీవుడ్ లో వినిపిస్తుంది. ఇందులో ప్రభాస్ క్లీన్ షేవ్ తో కాసేపు, ఆ తర్వాత గడ్డంతో కాసేపు కనిపిస్తారట. దీనికి సంబంధించిన లుక్ టెస్ట్ ముంబైలో జరిగిందని సమాచారం.
King Of India Box-Office 🔥🔥🔥🔥🔥#Prabhas 👑pic.twitter.com/63Bv2HJZg1
— Goutham (@goutham4098) September 22, 2024
ముంబై ఎయిర్ పోర్ట్ నుంచి ప్రభాస్ వీడియోలు బయటకు రాగా కొత్త లుక్ లో ప్రభాస్ అంటూ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. అయితే ప్రభాస్ చాలా వరకు మాస్క్ పెట్టుకొని తన ఫేస్ కవర్ చేసుకున్నాడు. అక్టోబర్ లో హను రాఘవపూడి – ప్రభాస్ సినిమా షూట్ మొదలవుతుందని సమాచారం.
#Prabhas was snapped at the airport with a clean-shaven look ahead of #PrabhasHanu shoot. pic.twitter.com/Zm7yIanVh0
— Gulte (@GulteOfficial) September 22, 2024