Telugu Indian Idol Season 3 : తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 విన్నర్ ఎవరో తెలుసా..? పవన్ కళ్యాణ్ సినిమాలో సాంగ్ ఛాన్స్..

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 ఫైనల్ ఎపిసోడ్ నిన్న టెలికాస్ట్ అయింది.

Telugu Indian Idol Season 3 : తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 విన్నర్ ఎవరో తెలుసా..? పవన్ కళ్యాణ్ సినిమాలో సాంగ్ ఛాన్స్..

Aha Telugu Indian Idol Season 3 Winner Here Details

Updated On : September 22, 2024 / 11:09 AM IST

Telugu Indian Idol Season 3 : ఆహా ఓటీటీలో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 గ్రాండ్ గా సాగింది. దాదాపు 15,000 మంది సింగర్స్ ని ఆడిషన్స్ చేసి ఫైనల్ గా 12 మందిని సెలెక్ట్ చేసి ఈ సీజన్ స్టార్ట్ చేసారు. ఈ సీజన్ లో ఫైనల్ కి అనిరుధ్ సుస్వరం, స్కంద, కీర్తన, శ్రీ కీర్తి, నసీరుద్దీన్.. ఈ అయిదుగురు కంటెస్టెంట్స్ వచ్చారు.

Also Read : Vinay Rai : ఒకప్పుడు రొమాంటిక్ హీరో.. ఇప్పుడేమో స్టార్ విలన్.. ఎవరో గుర్తుపట్టారా..?

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 ఫైనల్ ఎపిసోడ్ నిన్న టెలికాస్ట్ అయింది. ఈ సీజన్ లో విన్నర్ గా నసీరుద్దీన్ నిలిచాడు. తన పాటలతో మొదటి నుంచి ఫైనల్ వరకు జడ్జీలను, ప్రేక్షకులను మెప్పించి విన్నర్ గా నిలిచాడు. అలాగే పవన్ కళ్యాణ్ OG సినిమాలో పాట పాడే ఛాన్స్ కూడా ఆల్రెడీ దక్కించుకున్నాడు నసీరుద్దీన్. ఈ విషయాన్ని తమన్ గత ఎపిసోడ్స్ లోనే తెలిపాడు. ఆల్రెడీ OG సినిమా కోసం ఓ పాట పాడించాను అని తమన్ చెప్పాడు. దీంతో ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 విన్నర్ గా నిలిచిన నసీరుద్దీన్ కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక మొదటి రన్నరప్ గా అనిరుద్ సుస్వరం నిలవగా, రెండో రన్నరప్ గా శ్రీ కీర్తి నిలిచింది.

ఇక ఈ సీజన్ లో సింగర్ శ్రీరామచంద్ర యాంకరింగ్ చేస్తే తమన్, గీతా మాధురి, కార్తీక్ లు జడ్జీలుగా వ్యవహరించగా పలు ఎపిసోడ్స్ లో గెస్టులుగా హీరోలు, హీరోయిన్స్ వచ్చి సందడి చేసారు.