Vinay Rai : ఒకప్పుడు రొమాంటిక్ హీరో.. ఇప్పుడేమో స్టార్ విలన్.. ఎవరో గుర్తుపట్టారా..?
చాలా మంది హీరోలుగా చేసి సక్సెస్ కొట్టిన నటులు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, విలన్స్ గా చేస్తున్నారు. అదే లిస్ట్ లో ఇప్పుడు మరో నటుడు చేరాడు.

Hero Vinay Rai Turned as Villian and Character Artist do you Remember him
Vinay Rai : గతంలో హీరోలుగా చేసిన వాళ్లంతా ఇప్పుడు విలన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారుతున్న సంగతి తెలిసిందే. మన హీరోల్లో జగపతి బాబు, శ్రీకాంత్.. ఇలా చాలా మంది హీరోలుగా చేసి సక్సెస్ కొట్టిన నటులు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, విలన్స్ గా చేస్తున్నారు. అదే లిస్ట్ లో ఇప్పుడు మరో నటుడు చేరాడు. అతనే వినయ్ రాయ్.
హనుమాన్ సినిమాలో విలన్ గుర్తున్నాడా? అతనే వినయ్ రాయ్. ఇటీవల తెలుగులో హనుమాన్, గాండీవధార అర్జున, ఈగల్ సినిమాలతో పాటు తమిళ్ లో డాక్టర్.. లాంటి పలు సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించారు. దీంతో వినయ్ రాయ్ కి ఇప్పుడు విలన్ ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. అయితే గతంలో ఇతను ఓ రొమాంటిక్ హీరో, లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరో అని చాలా మందికి తెలీదు.
Also Read : Devara : వామ్మో.. దేవర 9 గంటల కథ.. అందుకే రెండు పార్టులు.. ఎన్టీఆర్ కామెంట్స్..
ముంబైకి చెందిన వినయ్ రాయ్ తమిళ్ లో హీరోగా ఎదిగాడు. తమిళ్ లో హీరోగా పలు హిట్స్ సాధించాడు. తెలుగులో వాన సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ అయినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ సినిమా పాటలు ఇప్పటికి వింటూనే ఉంటాం. తెలుగులో డైరెక్ట్ గా వాన సినిమా ఒక్కటే చేసాడు. అలాగే నీవల్లే నీవల్లే అనే డబ్బింగ్ సినిమాతో కూడా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అలా 2007,08 సమయంలో తెలుగు ప్రేక్షకులని మెప్పించి బోలెడంతమంది అమ్మాయిలని ఫ్యాన్స్ గా చేసుకున్నాడు వినయ్ రాయ్.
ఆ తర్వాత తమిళ్ లోనే సినిమాలు చేస్తున్నాడు. హీరోగా మార్కెట్ లేకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ గా మారాడు. ఇప్పుడు తమిళ్, తెలుగులో మంచి డిమాండ్ ఉన్న నటుడిగా బిజీగా ఉన్నాడు వినయ్ రాయ్. ప్రస్తుతం ఈ నటుడు హీరోయిన్ విమల రామన్ తో లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నారు.