Devara : వామ్మో.. దేవర 9 గంటల కథ.. అందుకే రెండు పార్టులు.. ఎన్టీఆర్ కామెంట్స్..
తాజాగా ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దేవర సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

NTR Deavara
Devara : ఎన్టీఆర్ దేవర సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. ఇప్పటికే వచ్చిన సాంగ్స్, ట్రైలర్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్యాన్స్, ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. నేడు దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. ఇక ఎన్టీఆర్, దేవర మూవీ టీమ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.
తాజాగా ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దేవర సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. దేవర సినిమాని రెండు పార్టులుగా తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ పార్ట్ ఆల్మోస్ట్ 3 గంటల నిడివి ఉంటుందని సమాచారం. దీంతో దేవర కథ లెంగ్త్ గురించి ఎన్టీఆర్ మాట్లాడారు.
ఎన్టీఆర్ మాట్లాడుతూ.. దేవర మొత్తం కథని తెరకెక్కిస్తే 9 గంటల సినిమా వస్తుంది. అంత పెద్ద కథ ఇది. కొంత కథతో పార్ట్ 1 తీసాము. మరికొంత కథతో పార్ట్ 2 తీస్తాము. అసలు కథలో చాలా కట్ చేస్తే కానీ ఫైనల్ అవుట్ పుట్ రాదు అని అన్నారు. అలాగే దేవర సినిమాలో ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ లకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాము. రొమాంటిక్ సీన్స్ కూడా కొత్తగా ఉంటాయి. ఆయుధ పూజ సీక్వెన్స్ సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది అని తెలిపారు ఎన్టీఆర్.
దీంతో ఫ్యాన్స్, ప్రేక్షకులు వామ్మో దేవర 9 గంటల కథా అని ఆశ్చర్యపోతున్నారు. అంత పెద్ద కథని రెండు పార్టులుగా చూపిస్తారా, మూడో పార్ట్ కూడా ఉంటుందా అని సందేహం వ్యక్తపరుస్తున్నారు.