NTR – Pawan Kalyan : ఆల్ ది బెస్ట్ తారక్.. మా ప్రభుత్వం సినిమా పరిశ్రమకు సపోర్ట్‌గా ఉంటుంది.. పవన్ కళ్యాణ్ స్పెషల్ ట్వీట్..
పవన్ కళ్యాణ్ తారక్ ట్వీట్ కి రిప్లై ఇవ్వడం గమనార్హం.

AP Deputy CM Pawan Kalyan Reply to NTR Devara Thanks Tweet it goes Viral
NTR – Pawan Kalyan : ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక సినీ పరిశ్రమకు ఫుల్ సపోర్ట్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ దేవర సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతుంది. భారీ బడ్జెట్ సినిమా, స్టార్ హీరో సినిమా కావడంతో దేవరకు టికెట్ రేట్ల పెంపు, ఎక్స్ ట్రా షోల కోసం ఏపీ ప్రభుత్వాన్ని అడగ్గానే వెంటనే పర్మిషన్స్ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం దేవర సినిమాకు మొదటి రోజు ఏడు షోలు, ఆ తర్వాత 9 రోజుల పాటు అయిదు షోలు పర్మిషన్ ఇచ్చారు. అలాగే రెండు వారాల పాటు సింగిల్ స్క్రీన్ అప్పర్ క్లాస్ కి 110 రూపాయలు, లోయర్ క్లాస్ కి 60 రూపాయలు, మల్టిప్లెక్స్ లకు 135 రూపాయల వరకు పెంచుకోడానికి అనుమతి ఇచ్చారు.
Also Read : NTR – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.. దేవర కోసం పవన్..
దీంతో దేవర సినిమా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, హీరో ఎన్టీఆర్ ఏపీ ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ కి, సినిమాటోగ్రఫీ మంత్రికు ధన్యవాదాలు తెలిపారు. మొదటిసారి ఓ హీరో టికెట్ రేట్ల పెంపుకు థ్యాంక్స్ చెప్తూ పవన్ కళ్యాణ్ కి, సీఎం చంద్రబాబుకు ట్వీట్ వేయడంతో ఆ ట్వీట్ వైరల్ గా మారింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ ట్వీట్ కి రిప్లై ఇవ్వడం గమనార్హం.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ ట్వీట్ కి రిప్లై ఇస్తూ.. మీ సినిమాకు బెస్ట్ విషెష్ తారక్ గారు. మా NDA ప్రభుత్వం ఏపీలో చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగు సినీ పరిశ్రమ కోసం నిలబడతాం, కావలిసినవి చేస్తాం అంటూ ట్వీట్ చేసారు. దీంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇలా ఇద్దరు హీరోలు ట్వీట్స్ చేసుకోవడంతో సోషల్ మీడియాలో ఈ ట్వీట్స్ చర్చగా మారాయి.
My best wishes on your film release @tarak9999 garu.Our NDA Govt in AP under the leadership of SRI @ncbn garu will do the needful and standby for Telugu film Industry. https://t.co/QfSyhfP1s3
— Pawan Kalyan (@PawanKalyan) September 21, 2024