Adipurush : ఆదిపురుష్‌లో తండ్రి కొడుకులుగా ప్రభాస్.. వైరల్ అవుతున్న ఫోటో!
ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ఇక ఈ మూవీ ప్రభాస్ తండ్రి కొడుకులుగా కనిపించాడట. రాముడిగా, దశరథుడుగా..
- gum 95921
- Updated on- June 16, 2023 / 07:45 AM IST
Prabhas play Lord Rama and his father Dasharatha roles in Adipurush
Prabhas Adipurush : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ప్రభాస్ రాముడిగా రామాయణ కథాంశంతో వచ్చిన ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ (Om Raut) తెరకెక్కించాడు. కృతి సనన్ (Kriti Sanon) సీతగా, సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) రావణాసురుడిగా ఈ సినిమాలో కనిపించారు. ప్రపంచవ్యాప్తంగా భారీ వ్యాప్తంగా రిలీజ్ అయిన మూవీ ప్రీమియర్స్ నుంచి ఆల్రెడీ టాక్ బయటకి వచ్చేసింది. సోషల్ మీడియా వేదిక సినిమా చూసిన ఎక్స్‌పీరెన్స్ పంచుకుంటున్నారు.
Adipurush : ప్రభాస్ ఆదిపురుష్ ట్విట్టర్ రివ్యూ.. టాక్ ఎలా ఉందో తెలుసా..?
ఇక ఈ చిత్రంలో ప్రభాస్ తండ్రి కొడుకులుగా కనిపించాడట. కొడుకుగా రాముడి పాత్రలో కనిపిస్తూనే, మొదటి కొంతసేపు తండ్రిగా దశరథుడు పాత్రలో కూడా కనిపించి అలరించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా టీజర్ టైంలో మూవీ టీం VFX విషయంలో భారీ ట్రోలింగ్ ఎదురుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మూవీలో కొన్ని చోట్ల VFX సూపర్ ఉంటే, కొన్ని చోట్ల మాత్రం ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుండు అనిపించింది అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.
Pawan Kalyan OG : పవన్‌కి విలన్‌గా మారుతున్న బాలీవుడ్ రొమాంటిక్ స్టార్..
సినిమాలో హైలైట్స్ విషయానికి వస్తే.. రాముడి, రావణాసురుడి ఎంట్రీ అంటున్నారు. అలాగే హనుమాన్ సంజీవని అండ్ లంకాదహనం సీన్స్ గూస్‌బంప్స్ అంటున్నారు. ఇక శబరి మరియు సుగ్రీవుడుతో రాముడు సన్నివేశాలు ఎమోషనల్ గా ఉన్నాయని చెబుతున్నారు. టి సిరీస్, రెట్రోఫైల్స్ సంయుక్త నిర్మాణంలో 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా చివరిగా ఎటువంటి టాక్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి. కాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది. థియేట్రికల్ రైట్స్ ద్వారా 270 కోట్ల వరకు, శాటిలైట్ అండ్ ఓటీటీ రైట్స్ ద్వారా దాదాపు 210 కోట్ల పైగా వచ్చినట్లు తెలుస్తుంది. మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఏ స్థాయి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.
