Prabhas Prasanth Neel Movie Replaed with Allu Arjun
Prabhas – Allu Arjun : సినీ పరిశ్రమలో ఒక హీరో చేయాల్సిన సినిమా ఇంకో హీరో దగ్గరకు పలు కారణాలతో వెళ్తూనే ఉంటుంది. ఈ క్రమంలో ఒక హీరో చేయాల్సిన సినిమా ఇంకో హీరో చేస్తాడు. ఇటీవల స్టార్ హీరోలంతా పాన్ ఇండియా మోజులో పడిపోవడం, భారీ లైనప్స్ పెట్టుకోవడంతో ఒక్కో సినిమాకు సమయం ఎక్కువ పడుతుండటంతో చేయాల్సిన సినిమాలు చేతులు మారుతున్నాయి.
త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కథ ఆధారంగా చేయాలి. కానీ పుష్ప 2 తర్వాత బన్నీ రూట్ మార్చడంతో ఆ కథ కాస్తా ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా సినిమా ఉందని నిర్మాత నాగవంశీ ప్రకటించాడు. ఆ కథకు తగ్గట్టు ఎన్టీఆర్ మురుగ అనే పుస్తకాన్ని కూడా చదవడం మొదలుపెట్టారు.
Also Read : Anupama Parameswaran : ఎన్నాళ్లకెన్నాళ్లకు.. చీరకట్టులో అనుపమ పరమేశ్వరన్.. ఫొటోలు..
తాజాగా మరో సినిమా చేతులు మారింది. ప్రభాస్ చేయాల్సిన సినిమా అల్లు అర్జున్ చేతికి వెళ్ళింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా సలార్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. వీరి కాంబోలో సలార్ 2 కూడా రావాల్సి ఉంది. అయితే వీరి కాంబోలో రావణం అనే సినిమాని కూడా అనుకున్నారు. తాజాగా ఆ సినిమా అల్లు అర్జున్ చేతికి వెళ్లిందట.
తమ్ముడు ప్రమోషన్స్ లో దిల్ రాజు మాట్లాడుతూ.. రావణం సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనే ఉంటుంది. ఆయన సలార్ 2, ఎన్టీఆర్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అవి అయ్యాకే ఆ సినిమా ఉంటుంది. అల్లు అర్జున్ తో ఈ సినిమా ఉంటుంది అని తెలిపారు. గత కొన్ని రోజులుగా దిల్ రాజు అల్లు అర్జున్ తో సినిమా చేయాలని అంటున్నారు. మొత్తానికి ఈ సినిమాని సెట్ చేసారు. గతంలో దిల్ రాజు నిర్మాణంలో అల్లు అర్జున్ మూడు సినిమాలు చేశారు. అయితే రావణం సినిమా మొదలవ్వడానికి కనీసం రెండేళ్లు పడుతుందని సమాచారం. దీంతో బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తుంటే ప్రభాస్ ఫ్యాన్స్ అది మా హీరో సినిమా కదా అని నిరాశ చెందుతున్నారు.
Also Read : NTR – Hrithik : ఫ్యాన్స్ కి నిరాశే.. ఎన్టీఆర్, హృతిక్ కలిసి కనపడరట.. ఇలా అయితే ఎలా?