NTR – Hrithik : ఫ్యాన్స్ కి నిరాశే.. ఎన్టీఆర్, హృతిక్ కలిసి కనపడరట.. ఇలా అయితే ఎలా?
వార్ 2 సినిమా పాన్ ఇండియా వైడ్ ఆగస్టు 14 రిలీజ్ కాబోతుంది.

NTR and Hrithik Roshan will not Appears together on War 2 Promotions
NTR – Hrithik : YRF స్పై యూనివర్స్ లో తెరకెక్కుతున్న ‘వార్ 2’ సినిమాలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వార్ 2 టీజర్ కూడా రిలీజ్ చేసారు. ఈ టీజర్ తో సినిమాపై అంచనాలు బాగానే నెలకొన్నాయి. ఆదిత్య చోప్రా నిర్మాణంలో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వార్ 2 సినిమా పాన్ ఇండియా వైడ్ ఆగస్టు 14 రిలీజ్ కాబోతుంది.
తాజాగా ఈ సినిమా నుంచి ఆసక్తికర విషయం వైరల్ అవుతుంది. హృతిక్, ఎన్టీఆర్ కలిసి నటిస్తుండటంతో బయట కూడా ఇద్దరూ కలిసి పాన్ ఇండియా వైడ్ ప్రమోషన్స్ చేస్తారని ఫ్యాన్స్ భావించారు. కానీ మూవీ యూనిట్ ఇద్దరితో సపరేట్‌గా ప్రమోషన్స్ చేయించాలని భావిస్తోంది. హృతిక్, ఎన్టీఆర్ కలిసి వార్ 2ని ప్రమోట్ చేయరట. ఏ ఈవెంట్‌లో కూడా ఈ ఇద్దరూ కలిసి కనిపించరట. దీంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ లెక్కన భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండదా? ఉంటే ఇద్దరూ రారా అనే సందేహం కూడా వ్యక్తపరుస్తున్నారు ఫ్యాన్స్.
అయితే అసలు వార్ 2 సినిమా చూడటానికి ప్రత్యేక ఆకర్షణ ఈ ఇద్దరే అని, అలాంటిది ఈ ఇద్దరినీ ఒకే సారి చూడాలంటే అది తెరపైనే చూడాలి గానీ ప్రమోషన్స్‌లో ఏ ఒక్క చోట కూడా ఈ ఇద్దరూ కలిసి కనిపించకూడదు అని, నేరుగా తెరపైనే ఆ ఇద్దరినీ ఒకే సారి చూస్తేనే ఆ థ్రిల్ ఉంటుంది అని యష్ రాజ్ ఫిల్మ్స్ టీం భావించి ఇలా ప్లాన్ చేశారట. ఈ లెక్కన సినిమా రిలీజ్ ముందు వరకు ఎన్టీఆర్, హృతిక్ ని కలిసి చూసే అదృష్టం లేనట్టే.
Also Read : Hari Hara Veera Mallu : ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ చూసిన పవన్.. పక్కనే త్రివిక్రమ్ కూడా..