Prabhas Raja Saab Movie Shooting Happening in Even Holidays
Prabhas – RajaSaab : ప్రభాస్ ఇటీవల బ్యాక్ టు బ్యాక్ సలార్, కల్కి సినిమాలతో హిట్స్ కొట్టాడు. ఇటీవలే హను రాఘవపూడి సినిమా ఓపెనింగ్ కూడా అయింది. ప్రస్తుతం రాజాసాబ్ షూటింగ్ లో ఉన్నాడు ప్రభాస్. మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ రాజాసాబ్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
అయితే ఇటీవల వినాయక చవితి, నిన్న ఆదివారం కూడా గ్యాప్ ఇవ్వకుండా రాజాసాబ్ షూటింగ్ చేస్తున్నారట. ప్రస్తుతం ముగ్గురు హీరోయిన్స్ మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ లతో ప్రభాస్ కాంబోలో ఉన్న సీన్స్ షూటింగ్ చేస్తున్నారట. పాపం పండగ పూట, ఆదివారాలు కూడా గ్యాప్ ఇవ్వకుండా షూటింగ్ చేస్తున్నారని, ప్రభాస్ సినిమా కోసం రెస్ట్ కూడా తీసుకోకుండా బాగా కష్టపడుతున్నాడని ఫ్యాన్స్ అంటున్నారు.
Also Read : Prabhas : ప్రభాస్ కామెడీ టైమింగ్ మాములుగా లేదుగా.. ఈ వీడియో చూసారా?
మొత్తానికి ఫ్యాన్స్ కోసం వరుస సినిమాలు చేయడానికి ప్రభాస్ ఇలా హాలీడేస్ కూడా తీసుకోకుండా షూటింగ్స్ చేస్తున్నారు. ఇక రాజాసాబ్ సినిమా వచ్చే సమ్మర్ ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది.