Rajasaab
Rajasaab : ప్రభాస్ రాజాసాబ్ సినిమా ఇటీవల జనవరి 9న రిలీజయింది. ఈ సినిమా యావరేజ్ టాక్ తో థియేటర్స్ లో నడుస్తుంది. అయితే ఈ సినిమాలో చాలా సీన్స్ ఎడిటింగ్ లో తీసేసారు. టీజర్, ట్రైలర్, గ్లింప్స్ లో చూపించిన ప్రభాస్ ముసలి గెటప్ అయితే పూర్తిగా సినిమాలోంచి తీసేసారు. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు.(Rajasaab)
అసలే తెలంగాణలో ప్రీమియర్స్ పడక, ఏపీలో ప్రీమియర్ వెయ్యి రూపాయలు పెట్టడంతో ఫ్యాన్స్ సినిమా చూద్దామనుకున్నా చూడలేకపోయారు. ఈ విషయంలో ఫ్యాన్స్ నిరాశ చెందితే సినిమా చూసిన ఫ్యాన్స్ అసలైన సీన్స్ అన్ని ఎడిటింగ్ లో తీసేశారని ఫైర్ అయ్యారు. డైరెక్టర్ మారుతీ పై విమర్శలు చేసారు.
Also Read : Harish Shankar : ఉంచాలన్నా తీసేయాలన్నా నన్ను అడగాలి.. రవితేజ నిర్ణయాన్ని ప్రశ్నించిన హరీష్ శంకర్..
నిన్న డైరెక్టర్ మారుతూ సక్సెస్ మీట్ పెట్టి కట్ చేసిన సీన్స్, ప్రభాస్ ముసలి గెటప్ సీన్స్ కొన్ని థియేటర్స్ లో జత చేసి మళ్ళీ రిలీజ్ చేస్తాం అని చెప్పారు. నేడు ఉదయం ఆటనుంచి రాజాసాబ్ కొత్త వర్షన్ థియేటర్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేసారు.
అప్ సైడ్ డౌన్ ప్రోమో అంటూ ప్రభాస్ ముసలి గెటప్ లో చేసే ఫైట్ కి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేసారు. ఇందులో ప్రభాస్ గాల్లోకి ఎగిరి మరీ ఫైట్స్ చేసాడు. దీంతో ఇంత మంచి ఫైట్ సీన్స్, కంటెంట్ పెట్టుకొని ఇవి ఎందుకు యాడ్ చేయలేదు అని ఫ్యాన్స్ మారుతిని విమర్శిస్తున్నారు.
ఇదేదో ముందే యాడ్ చేస్తే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చేది కదా అని వాపోతున్నారు. ఇక కొత్తగా సినిమాలో ఏం జతచేసారో చూడటానికి పాపం ఫ్యాన్స్ మళ్ళీ సినిమాకి వెళ్ళాలి, చూడాలి అని ఫీల్ అవుతున్నారు. రిలీజ్ లోనే క్లారిటీ లేదు అనుకుంటే అసలు సినిమాలో ఏం కంటెంట్ పెట్టాలి, ఎడిటింగ్ లో ఏం తీసేయాలి కూడా క్లారిటీ లేదా అని మారుతిపై ఫైర్ అవుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. రాజాసాబ్ నుంచి రిలీజ్ చేసిన కొత్త ప్రోమో చూసేయండి..