Rajasaab
Rajasaab : ప్రభాస్ రాజాసాబ్ సినిమాతో సంక్రాంతికి రాబోతున్నాడు. ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడటం, రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ కూడా అంతగా ఇంపాక్ట్ చూపించకపోవడంతో సినిమాపై అంచనాలు మామూలుగానే ఉన్నాయి. ఫ్యాన్స్ కూడా రాజాసాబ్ సినిమాపై పెద్దగా ఆశలు పెట్టుకోవట్లేదు. తాజాగా రాజాసాబ్ సినిమా గురించి ఆసక్తికర సమాచారం వినిపిస్తుంది.(Rajasaab)
రాజాసాబ్ సినిమా షూటింగ్ ముగించుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే ఈ సినిమా షూటింగ్ టోటల్ ఫుటేజ్ మొత్తం కలిపి ఏకంగా నాలుగు గంటల పైనే వచ్చిందట. దీంతో చాలా వరకు ఎడిటింగ్ చేసేస్తున్నారట. ఎంత ఎడిట్ చేసినా మూడు గంటల 15 నిముషాలు మాత్రం ఉంటుందట. చివరకు మారుతి, ప్రభాస్ డిస్కస్ చేసుకొని రాజాసాబ్ సినిమా నిడివి మూడు గంటల పది నిమిషాలకు తెచ్చారని తెలుస్తుంది.
Also Read : Andhra King Taluka OTT: ఓటీటీకి వస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
హారర్ కామెడీ, ప్రభాస్ – హీరోయిన్స్ మీద సాంగ్స్ తో మూడు గంటల పది నిముషాలు థియేటర్లో కూర్చోబెడతారా చూడాలి. కొన్నేళ్ల క్రితం ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలంలో నాలుగు గంటలు, మూడున్నర గంటల సినిమాలు ఉండేవి. మళ్ళీ ఇప్పుడు గత కొంతకాలం నుంచి మూడు గంటలు, ఆ పైన ఉన్న సినిమాలు వస్తున్నాయి. మరి మూడు గంటల పది నిముషాలు నిడివి ఉన్న రాజాసాబ్ సినిమా ప్రేక్షకులను, ఫ్యాన్స్ ని ఎలా మెప్పిస్తుందో చూడాలి.