Prabhas : సర్జరీ పూర్తి చేసుకున్న ప్రభాస్.. యూరప్ నుంచి తిరిగి రానున్నాడు..

సెప్టెంబర్ నెలలో సర్జరీ కోసం యూరప్ వెళ్లిన ప్రభాస్.. ఇప్పుడు హైదరాబాద్ తిరిగి వస్తున్నాడు.

Prabhas returning from europe to completing his knee surgery

Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా నుంచి మోకాలి నొప్పితో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య దాని కోసం తాత్కాలిక చికిత్స తీసుకున్నప్పటికీ.. ప్రభాస్ ఇంకా ఆ నొప్పితో బాధ పడుతూనే ఉన్నాడు. ఆదిపురుష్, సలార్ సినిమాల షూటింగ్ ని ఆ బాధతోనే పూర్తి చేశాడు. అయితే ఆ నొప్పి ఇప్పుడు మరింత సమస్యగా మారిందట. ఆదిపురుష్ సినిమా టైములో నడవలేక చాలా బాధ పడుతూ కనిపించిన సందర్భాలు అందరూ చూసినవే. ఇక ఈ సమస్య నుంచి పూర్తిగా కోలుకునేందుకు ప్రభాస్ సర్జరీ కోసం వెళ్ళాడు.

సెప్టెంబర్ నెలలో ఈ సర్జరీ కోసం యూరప్ వెళ్లిన ప్రభాస్.. ఆపరేషన్ ని గత నెలలోనే పూర్తి చేసుకున్నాడు. అయితే నెల పాటు విశ్రాంతి అవసరం అవ్వడంతో అక్కడే ఉండి రెస్ట్ తీసుకున్నాడు. ఇప్పుడు ప్రభాస్ కంప్లీట్ గా రికవరీ అయ్యినట్లు సమాచారం. నవంబర్ 6న హైదరాబాద్ లో ల్యాండ్ అవబోతున్నాడట. ఇక వచ్చిన వెంటనే సలార్ ప్రమోషన్స్ ని ప్లాన్ చేయనున్నాడట. సలార్ డిసెంబర్ 22న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ ని ఇప్పటివరకు మొదలు పెట్టలేదు.

Also read : Alekhya Harika : హీరోయిన్‌గా ఎంట్రీతోనే లిప్ కిస్‌తో రెచ్చిపోయిన దేత్తడి హారిక.. బేబీ డైరెక్టర్.. మళ్ళీ అదే ఫార్మేట్ సినిమా?

ఈ నెలలో ప్రభాస్ పుట్టినరోజు, దసరా ఒకేసారి వచ్చినా.. సలార్ చిత్ర యూనిట్ నుంచి ఎటువంటి అప్డేట్ రాకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. మరి ఈ దీపావళి నుంచి అయినా ప్రమోషన్స్ మొదలుపెడతారా..? లేదా..? చూడాలి. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ పై ఇండియా వైడ్ భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండు పార్టులుగా తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ సీజ్ ఫైర్ టైటిల్ తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. మలయాళ స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.