Alekhya Harika : హీరోయిన్‌గా ఎంట్రీతోనే లిప్ కిస్‌తో రెచ్చిపోయిన దేత్తడి హారిక.. బేబీ డైరెక్టర్.. మళ్ళీ అదే ఫార్మేట్ సినిమా?

అలేఖ్య హారిక హీరోయిన్ గా, సంతోష్ శోభన్(Santosh Soban) హీరోగా సుమన్ పాతూరి అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

Alekhya Harika : హీరోయిన్‌గా ఎంట్రీతోనే లిప్ కిస్‌తో రెచ్చిపోయిన దేత్తడి హారిక.. బేబీ డైరెక్టర్.. మళ్ళీ అదే ఫార్మేట్ సినిమా?

Alekhya Harika Santosh Soban New Movie Launched and First Look Released by Naga Chaitanya

Updated On : October 30, 2023 / 1:46 PM IST

Alekhya Harika : యూట్యూబ్(YouTube) లో దేత్తడి పిల్లగా తెలంగాణ స్లాంగ్ తో వీడియోలు చేస్తూ పాపులర్ అయింది అలేఖ్య హారిక. యూట్యూబ్ లో వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్, సిరీస్ లు, బిగ్ బాస్ తో మరింత ఫేమస్ అయింది ఈ తెలంగాణ అమ్మడు. ప్రస్తుతం యూట్యూబ్ లోనే పలు ప్రైవేట్ ఆల్బమ్స్, సిరీస్ లు చేస్తూ అప్పుడప్పుడు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తుంది. అలేఖ్య హారిక ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది.

అలేఖ్య హారిక హీరోయిన్ గా, సంతోష్ శోభన్(Santosh Soban) హీరోగా సుమన్ పాతూరి అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. బేబీ(Baby) నిర్మాత SKN, బేబీ డైరెక్టర్ సాయి రాజేష్(Sai Rajesh) కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తాజాగా నేడు ఈ సినిమా పూజా కార్యక్రమం జరిపి నాగచైతన్య చేతుల మీదుగా ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు.

Also Read : Keeda Cola Pre Release Event : ‘కీడా కోలా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు..

అయితే ఫస్ట్ లుక్ లోనే హీరో – హీరోయిన్ లిప్ కిస్ ఇస్తున్న పోస్టర్ ని రిలీజ్ చేశారు. అలాగే ఈ పోస్టర్ మీద ‘కొన్ని ప్రేమ కథలు జీవితకాలం వెంటాడుతాయి’ అని రాసారు. దీంతో ఈ పోస్టర్ వైరల్ గా మారింది. ఈ పోస్టర్, పోస్టర్ మీద డైలాగ్ చూస్తుంటే మళ్ళీ బేబీ ఫార్మేట్ లోనే వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఇక దేత్తడి హారిక హీరోయిన్ గానే ఎంట్రీ ఇస్తూనే మొదటి సినిమాలో లిప్ కిస్, రొమాన్స్ చేయబోతున్నట్టు ఈ పోస్టర్ తోనే అర్ధమవుతుంది. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ప్రకటించలేదు. మరి బేబీ సినిమాలాగే ఈ సినిమా కూడా హిట్ అవుతుందా, వైష్ణవి లాగే అలేఖ్య హారిక కూడా పేరు తెచ్చుకుంటుందా చూడాలి.