Prabhas: నా రూటే సపరేట్.. సినిమా సినిమాకి ప్రభాస్ వేరియేషన్స్!

ప్యాన్ ఇండియా స్టార్.. గ్లోబల్ స్టార్.. ఇప్పుడీ పదాలు వింటే టక్కున గుర్తొచ్చే పేరు.. ప్రభాస్. అది ఇప్పుడే కాదు.. ఎప్పటికీ గుర్తుండేలా తన కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు డార్లింగ్.

Prabhas: ప్యాన్ ఇండియా స్టార్.. గ్లోబల్ స్టార్.. ఇప్పుడీ పదాలు వింటే టక్కున గుర్తొచ్చే పేరు.. ప్రభాస్. అది ఇప్పుడే కాదు.. ఎప్పటికీ గుర్తుండేలా తన కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు డార్లింగ్. నెవర్ బిఫోర్ క్యారెక్టర్స్ తో మెస్మరైజ్ చేయబోతున్నారు. సౌత్ ఇండియాలో 300 కోట్ల కలెక్షన్స్ క్రాస్ చేసిన సినిమాల్లో 3 ప్రభాస్ వే. మరి ఆమాత్రం రేంజ్ కొత్త ప్రాజెక్టుల్లో చూపించాలని గట్టిగా డిసైడయ్యారు. సినిమా సినిమాకి వేరియేషన్స్ చూపిస్తా అంటున్నారు ప్రభాస్. గ్లోబల్ స్టార్ కదా.. ఆమాత్రం రేంజ్ కనిపించేలా క్యారెక్టర్స్ సెట్ చేసుకుంటున్నారు. తన కెరీర్ లో ఇంతవరకు నటించని రోల్స్ ని, ఇంతవరకు ట్రై చేయని కాస్ట్యూమ్స్ ని వేసుకుంటున్నారు. ఏదేమైనా ఫ్యాన్స్ కి గట్టి ట్రీట్ ఇచ్చేందుకు బాగానే కష్టపడుతున్నారు.

Shanmukh-Deepthi: దీప్తికి ఇదే షణ్ముఖ్ చివరి ముద్దు.. వీడియో వైరల్!

క్రేజీ డైరెక్టర్ అర్జున్ రెడ్డి వంగాతో రెబల్ స్టార్ సినిమా.. అంచనాలు అందని విధంగా ప్లాన్ చేశారు. ప్రభాస్ కెరీర్ కిది మైలో స్టోన్ సినిమా.. తన 25వ సినిమా. అందుకే కాస్త డిఫరెంట్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. ఇప్పటివరకు రొమాంటిక్, మాస్ లుక్స్ లోనే ఎక్కువగా మెప్పించారీ హీరో. అయితే స్పిరిట్ మూవీలో ప్రభాస్ చేస్తున్నది పోలీస్ క్యారెక్టర్. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత భూషణ్ కుమార్ రివీల్ చేశాడు. నేషనల్ వైడ్ గుర్తింపు పొందిన డార్లింగ్ తన కెరీర్ లో ఫుల్ లెంత్ పోలీస్ రోల్ చేయలేదు. స్పిరిట్ సినిమాతో ఫస్ట్ టైమ్ ఖాకీ డ్రెస్ వేసుకుని, లాఠి పట్టుకోనే ప్రభాస్ ను చూస్తారని చెప్పుకొచ్చారు.

Telugu Film Production: అప్ కమింగ్ హీరోలకు లిఫ్ట్ ఇస్తున్న స్టార్ ప్రొడ్యూసర్స్!

సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ తో కాప్ స్టోరీ చూపించబోతుంటే.. ప్రశాంత్ నీల్ మరో సర్ ప్రైజింగ్ రోల్ ప్లాన్ చేశాడు. సలార్ లో గ్లోబల్ స్టార్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. దాదాపు 150 కోట్లతో.. 1970ల్లో జరిగే రెట్రోస్టోరీగా సలార్ తెరకెక్కుతోంది. ప్రశాంత్ నీల్ సృష్టించిన పాక్ – ఇండియా వార్ బ్యాక్ డ్రాప్ ఈ మూవీకి హైలైట్ కానుంది. ఈ సీన్స్ లో ఆర్మీ ఆఫీసర్ గా కనిపించే ప్రభాస్.. సలార్ లో గ్యాంగ్ స్టర్ గానూ నటిస్తున్నాడు. అయితే సలార్ లో ఈ హీరో చేస్తున్నది డ్యూయల్ రోలా, డ్యూయల్ షేడ్స్ ఉన్న క్యారెక్టరా అన్నది తెలియాల్సి ఉంది.

Disha Patani: వింటర్‌లో కూడా చెమటలు పట్టిస్తున్న దిశా!

నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ కే లోనూ ప్రభాస్ ది నెవర్ బిఫోర్ క్యారెక్టరే. ఇందులో సూపర్ హీరో తరహాలో ప్రభాస్ రోల్ ను ప్లాన్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. ప్రభాస్ కు సూపర్ హీరో అని ట్యాగ్ లైన్ ను కూడా యాడ్ చేసింది ప్రాజెక్ట్ కె టీమ్. 500 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసమే దాదాపు 200 రోజుల కాల్షీట్స్ ఇచ్చారు ప్రభాస్. దీపికా, అమితాబ్ వంటి వారు నటిస్తోన్న ఈ మూవీ 90 శాతం షూటింగ్ సెట్స్ లోనే జరగనుంది. మొత్తానికి ఈ టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ స్టోరీలో ప్రభాస్ ది మాత్రం మెస్మరైజ్ చేసే రోల్ అని మాత్రం చెప్తున్నారు.

Karishma Tanna: అందంతో మతిపోగొట్టడమే నీ పనా కరిష్మా!

ఇక అన్నింటికి భిన్నంగా దేవుడు రాముడిగా ప్రభాస్ ను చూపించబోతున్నాడు ఓంరౌత్. ఆదిపురుష్ సినిమాలో రాముడిగా నటిస్తోన్న ప్రభాస్ గెటప్ చాలా థ్రిల్ ఇస్తుందని చెప్తున్నారు. అలాగే ఇందులో రామాయణం మొత్తం చూపించమని.. ఇంతవరకు పెద్దగా ఎక్స్ పోజ్ అవ్వని రామయణ కొన్ని ఘట్టాలనే చెప్పబోతున్నామన్నాడు ఓంరౌత్. వాటిలో ప్రభాస్ లుక్, క్యారెక్టరైజేషన్ ఊహకందదంటూ ఎక్స్ పెక్టేషన్స్ పీక్స్ కు తీసుకెళ్లారు.

Netflix-Prime Video: మాటకు మాట.. నెట్‌ఫ్లిక్స్-ప్రైమ్ వీడియో ట్విట్టర్ వార్!

ఇక రాధేశ్యామ్ లో కూడా ప్రభాస్ కొత్తగానే ట్రై చేశారు. ట్రైలర్ లో రొమాంటిక్ అండ్ లవర్ బాయ్ గా కనిపించారు. పామిస్ట్ గా ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. రాధేశ్యామ్ సినిమాలో హస్తరేఖలతో భవిష్యత్ చెప్పే పామిస్ట్ గా క్రేజీగా కనిపిస్తారని డైరెక్టర్ రాధేశ్యామ్ ఆల్రెడీ చెప్పేశారు. ట్రైన్, షిప్ యాక్సిడెంట్ ఎపిసోడ్స్ లో ప్రభాస్ యాక్టింగ్ తన కెరీర్ లోనే హైలైట్ అని కూడా చెప్తున్నారు. సో రిలీజ్ ఎప్పడెప్పుడా అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు