Salaar Collections : సలార్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. బాలీవుడ్‌కి మళ్ళీ టెన్షన్..

సలార్ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూసి బాలీవుడ్‌కి మళ్ళీ టెన్షన్ పట్టుకుంది.

Prabhas Salaar Collections first day Collections details

Salaar Collections : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన సలార్ రెండు భాగాలుగా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం మొదటి భాగం.. నిన్న పాన్ ఇండియా వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ప్రభాస్ నుంచి చాలా కాలం తరువాత ఒక మాస్ బొమ్మ రావడం, దానికి ప్రశాంత్ నీల్ దర్శకుడు కావడంతో మూవీ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద మూవీకి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. సలార్ మొదటిరోజు కలెక్షన్స్ చూసి బాలీవుడ్ కి మళ్ళీ టెన్షన్ పట్టుకుంది.

మొదటి రోజు ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.178.7 కోట్ల గ్రాస్ ని అందుకుందని నిర్మాతలు తెలియజేశారు. అంటే నెట్ కలెక్షన్స్ 89 కోట్లకు పైగా వచ్చినట్లు తెలుస్తుంది. కాగా ఈ ఏడాది బాలీవుడ్ నుంచి వచ్చిన షారుఖ్ ఖాన్, రణబీర్ కపూర్ సినిమాలు ఇండియా వైడ్ భారీ ఓపెనింగ్స్ సాధించాయి. పఠాన్ 106 కోట్ల గ్రాస్, జవాన్ 129 కోట్ల గ్రాస్, యానిమల్ 116 కోట్ల గ్రాస్ ని అందుకున్నాయి. అయితే ఇప్పుడు ప్రభాస్ మూవీ సలార్.. బాలీవుడ్ స్టార్స్ సినిమాల మించి కలెక్షన్స్ అందుకొని సంచలనం సృష్టిస్తుంది.

Also read : Chiranjeevi : సలార్ టీంకి చిరంజీవి అభినందనలు.. మై డియర్ ప్రభాస్..

ఇక ఈ కలెక్షన్స్ చూసిన బాలీవుడ్ వాళ్ళకి మళ్ళీ టెన్షన్ మొదలైంది. మొన్నటి వరకు బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ లిస్టులో బాహుబలి 2నే మొదటి స్థానంలో ఉంది. ఈ ఏడాది షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో ఆ ప్లేస్ ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత జవాన్ మొదటి స్థానంలో, పఠాన్ సెకండ్ ప్లేస్ లో పెట్టి బాహుబలి 2 మూడో స్థానంలో చేర్చారు. ఇప్పుడు సలార్ మొదటి రోజే ఈ రేంజ్ కలెక్షన్స్ అందుకోవడంతో.. మళ్ళీ ఎక్కడ ఆ ఫస్ట్ ప్లేస్ పోతుందో అని భయపడుతున్నారు. మరి ప్రభాస్ సలార్ తో ఏం చేస్తారో చూడాలి.