Salaar : కేజీఎఫ్‌తో సలార్‌కి కనెక్షన్.. వైరల్ అవుతున్న పోస్ట్.. నీల్ సినిమాటిక్ యూనివర్స్!

సలార్ సినిమా ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రాబోతోందా..? కేజీఎఫ్‌తో సలార్‌కి కనెక్షన్ అంటూ వైరల్ అవుతున్న పోస్ట్.

Prabhas Salaar connection with Yash Kgf news viral

Salaar : కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కలయికలో వస్తున్న చిత్రం ‘సలార్’. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ తోనే భారీ హైప్ ని క్రియేట్ అయ్యింది. ప్రభాస్ కట్ అవుట్ కి ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ తోడైతే ఆ సినిమా ఎలా ఉండబోతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక ఈ మూవీకి కేజీఎఫ్ చిత్రానికి కనెక్షన్ ఉండబోతుందంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ కాగా అందులోని కొన్ని సీన్స్ ని చూసి అభిమానులు.. ఇది ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Krithi Shetty : స్టార్ హీరో కొడుకు వేధింపులు.. కృతి శెట్టి రియాక్షన్ పోస్ట్ వైరల్..

టీజర్ లోని ఒక షాట్ లో ఒక కంటైనర్ కనిపిస్తుంది. దాని పై C-516 అని కనిపిస్తుంది. ఆ పక్కన ఉన్న ఒక షెడ్ పై కూడా ఒక నెంబర్ కనిపిస్తుంది. ఇదే సెట్ ప్రోపర్టీ కేజీఎఫ్ సినిమాలో కూడా కనిపిస్తుంది. ఆ రెండిటిని పక్కన పెట్టి సోషల్ మీడియాలో నెటిజెన్స్ వైరల్ చేస్తున్నారు. మరి నిజంగా సలార్ అండ్ కేజీఎఫ్ కి కనెక్షన్ ఉందా? లేదా? తెలియాలంటే రిలీజ్ వరకు ఎదురు చూడాల్సిందే. కాగా ఈ సినిమాని కూడా రెండు భాగాలుగా తీసుకు రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Bro : మ్యూజికల్ ప్రమోషన్ మొదలుపెట్టబోతున్న బ్రో.. మై డియర్ మార్కండేయ ఫస్ట్ సింగల్!

మొదటి పార్ట్ ని ‘Ceasefire’ అనే పేరుతో ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. సెప్టెంబర్ 28న పార్ట్ 1 పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా, మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్స్ గా, శ్రియారెడ్డి, మరికొంతమంది స్టార్ ఆర్టిస్టులు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ కి సరైన హిట్టు లేకపోవడంతో అభిమానులు ఆశలు అన్ని సలార్ పైనే ఉన్నాయి. మరి ఈ చిత్రం ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.

 

ట్రెండింగ్ వార్తలు