Salaar Song : సలార్ నుంచి మరో కొత్త సాంగ్ రిలీజ్.. విన్నారా? ప్రతి గాథలో రాక్షసుడే..

రేపు సినిమా రిలీజ్ అనగా ఇవాళ సలార్ సినిమా నుంచి మరో సాంగ్ విడుదల చేసి అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు.

Prabhas Salaar Movie Second Song Released

Salaar Song : ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) హీరోగా రెండు పార్టులుగా తెరకెక్కుతున్న సలార్ సినిమా part 1 సీజ్ ఫైర్ రేపు డిసెంబర్ 22న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకులంతా ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

సలార్ సినిమాకు ప్రమోషన్స్ చేయకపోయినా టీజర్, ట్రైలర్స్, ఓ సాంగ్ మాత్రమే రిలీజ్ చేసి సినిమాపై హైప్ పెంచారు. ఇక రేపు సినిమా రిలీజ్ అనగా ఇవాళ సినిమా నుంచి మరో సాంగ్ విడుదల చేసి అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు. ప్రతి గాథలో రాక్షసుడే.. అని సాగే ఈ సాంగ్ వింటుంటే గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఈ పాటలోని లిరిక్స్ ప్రభాస్ క్యారెక్టర్ కోసమా అనిపిస్తాయి. అలాగే లిరిక్స్ చాలా అర్థవంతంగా ఉన్నాయి. ఈ సాంగ్ ని కృష్ణకాంత్ రాయగా రవి బస్రూర్ సంగీతంలో పలువురు చైల్డ్ సింగర్స్ పాడారు.