Prabhas Salaar shooting is held at James Bond No Time To Die location
Salaar : ప్రభాస్ (Prabhas) నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్ (Salaar). ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం పై పాన్ ఇండియా వైడ్ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒక టీజర్ కూడా రిలీజ్ కాకముందే ఎన్నో రికార్డులు సృష్టిస్తుంది. బుక్ మై షో వంటి టికెట్ బుకింగ్ యాప్ లో రిలీజ్ కి ముందే ఎక్కువమంది ఇంటరెస్ట్ చూపిస్తున్న సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ సినిమా గురించి ఇక్కడ మీడియాలో ఆర్టికల్స్ రావడం కాదు, ఏకంగా ఇటలీ దేశ మీడియాలో కూడా ఆర్టికల్స్ వస్తున్నాయి. ఇటలీలో షూటింగ్ చేయడానికి ప్రభాస్ సలార్ టీం రాబోతుంది అంటూ అక్కడి మీడియా వార్త రాసుకు రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
Salaar : పాన్ వరల్డ్ సినిమాగా రాబోతున్న సలార్.. నిజమేనా?
కాగా సలార్ ఇటలీలో షూటింగ్ జరుపుకుంటున్న లొకేషన్‌లో.. గతంలో జేమ్స్ బాండ్ (James Bond) మూవీ షూటింగ్ జరుపుకుంది. నో టైం టు డై (No Time To Die) సినిమా అక్కడే షూటింగ్ జరుపుకుంది. ఆ తరువాత వండర్ వుమెన్ తో (Wonder Women) పాటు మరో రెండు ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ అక్కడే చిత్రీకరణ జరుపుకున్నాయి. ఇప్పుడు ఆ లొకేషన్ లో ప్రభాస్ సలార్ షూటింగ్ జరుపుకోబోతుంది. భారీ లైట్స్ లో డ్రోన్ ల సహాయంతో నైట్ టైం షూటింగ్ చేయనున్నారు. దీంతో అక్కడి లోకల్ పోలీస్ ల దగ్గర నుంచి చిత్ర యూనిట్ అనుమతులు కూడా తీసుకుందట.
Sudeep : బ్రేక్ తీసుకోలే.. వచ్చింది అంటున్న కిచ్చా సుదీప్.. కొత్త ప్రాజెక్ట్స్ అప్డేట్!
ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran), టాలీవుడ్ జగ్గు భాయ్ జగపతి బాబు విలన్స్ గా కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన వీరిద్దరి పోస్టర్స్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. శృతిహాసన్ (Shruti Haasan) మొదటిసారి ప్రభాస్ సరసన నటిస్తుంది. రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్ 28న ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతుంది.
Print Article of the day (Times of India) about #Salaar Shooting in Matera, Italy. #Prabhas #SalaarTheSaga pic.twitter.com/iJSTd65l7k
— Prabhas ❤ (@ivdsai) April 2, 2023