Salaar : రికార్డు క్రియేట్ చేసిన సలార్ టీజర్.. ఏ విషయంలో తెలుసా..?

ప్రభాస్ సలార్ టీజర్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. తాజాగా ఈ టీజర్ ఒక కొత్త రికార్డు క్రియేట్ చేసింది. అదేంటంటే..

Prabhas Salaar teaser creates records in youtube

Salaar : రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న మోస్ట్ యాంటిసిపేటడ్ మూవీ ‘సలార్’. కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా, మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్స్ గా, శ్రియారెడ్డి, మరికొంతమంది స్టార్ ఆర్టిస్టులు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. హోంబలే ఫిల్మ్స్ ఈ సినిమాని 200 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ టీజర్ ని రిలీజ్ చేశారు.

Salaar : కేజీఎఫ్‌తో సలార్‌కి కనెక్షన్.. వైరల్ అవుతున్న పోస్ట్.. నీల్ సినిమాటిక్ యూనివర్స్!

ఈ మూవీ అనౌన్స్‌మెంట్ తోనే భారీ హైప్ క్రియేట్ అవ్వడంతో టీజర్ పై ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకుంది. దీంతో ఈ టీజర్ వ్యూస్, లైక్స్ విషయంలో రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈ టీజర్ ఇప్పటి వరకు 59 మిలియన్ వ్యూస్, 1.4 మిలియన్ లైక్స్ అందుకుంది. కాగా కేవలం 24 గంటలోనే అత్యధిక వ్యూస్ అందుకున్న టాప్ 5 లిస్ట్ లో 4 స్థానాలు ప్రభాస్ పేరు పైనే ఉన్నాయి. దాదాపు 101M+ వ్యూస్ అందుకొని ఆదిపురుష్ సినిమా మొదటి స్థానంలో నిలిచింది. ఆ తరువాత KGF2 68.8M వ్యూస్ తో సెకండ్ ప్లేస్ ఉంది.

Salaar : అప్పుడు సాహో.. ఇప్పుడు సలార్.. టీజర్‌లో ఎలివేషన్స్ ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా?

ఇక సలార్ 59M+ వ్యూస్, రాధే శ్యామ్ 46.6M వ్యూస్, సాహు 44.5M వ్యూస్ తో తరవాతి స్థానంలో నిలిచాయి. ఇక్కడ విశేషం ఏంటంటే సలార్ ఇంకా 24 గంటలు పూర్తి చేసుకోలేదు. మరి రేపటి లోపు మరికొన్ని వ్యూస్ అందుకొని KGF2 రికార్డుని బ్రేక్ చేస్తుందా లేదా చూడాలి. కాగా ఈ సినిమాని కూడా ప్రశాంత్ నీల్ రెండు భాగాలుగా తీసుకు రాబోతున్నాడు. మొదటి పార్ట్ ని ‘Ceasefire’ అనే పేరుతో సెప్టెంబర్ 28న రిలీజ్ చేయబోతున్నారు.