Prabhas spoke about his lifelong Desire
Prabhas : బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో వస్తున్న అన్‌స్టాపబుల్ షో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆరు ఎపిసోడ్స్ అవ్వగా ఏడో ఎపిసోడ్ గా ప్రభాస్ ని తీసుకొచ్చారు. ప్రభాస్ ఈ షోకి వస్తున్నాడు అని తెలియడంతో ముందునుంచి ఈ ఎపిసోడ్ పై అంచనాలు పెరిగిపోయాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఈ ఎపిసోడ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. అయితే ప్రభాస్ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తామని ప్రకటించి ఫ్యాన్స్ కి మరింత జోష్ ఇచ్చింది ఆహా టీం.
ప్రభాస్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ డిసెంబర్ 30న స్ట్రీమ్ అవుతుందని చెప్పినా డిసెంబర్ 29 రాత్రే రిలీజ్ చేసి అభిమానులకి ముందుగానే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని ఇచ్చింది ఆహా. ఎపిసోడ్ రిలీజ్ అయిన కొద్ది నిమిషాలకే ఆహా సర్వర్లు ఎక్కువ ఫ్లోటింగ్ తో క్రాష్ అయ్యాయి అంటే ఈ ఎపిసోడ్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.
Prabhas : ఏమీ లేకపోయినా సోషల్ మీడియాలో నా మీద అనవసరంగా రాస్తున్నారు.. ప్రభాస్!
ఇక ఎపిసోడ్ లో ప్రభాస్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు బాలయ్య. ప్రభాస్ నటుడిగా మారి 20 సంవత్సరాలు అవుతుండటంతో అభిమానులతో స్పెషల్ షూట్ చేసి ప్రోమో కూడా వేశారు. ప్రభాస్ ఈ ఎపిసోడ్ లో తన లైఫ్ లాంగ్ కోరిక చెప్పాడు. హైదరాబాద్ బయట ఒక అడవిని దత్తత తీసుకున్నాను అని, చెట్లు, మొక్కలు, జంతువులు అంటే ఇష్టం అని అన్నాడు. ప్రపంచంలోని అడవులన్ని చుట్టేయాలి ఎప్పటికైనా, లోకల్ అడవులు, కర్ణాటక, ఇండియాలోని కొన్ని అడవులు తిరిగాను ఫ్రెండ్స్ తో. ప్రపంచంలోని వేరే దేశాల్లో ఉన్న అడవులు కూడా తిరగాలని ఉంది. అలాగే నా అడవిలో పులులు పెంచుకోవాలని అనుకున్నాను, గవర్నమెంట్ ని కూడా అడిగాను కానీ ఒప్పుకోలేదు. నా అడవుల్లో సింహాలు, పులులు పెంచుకోవాలని అనుకుంటున్నాను అని తెలిపాడు ప్రభాస్. అలాగే ఇప్పుడిప్పుడే ఆస్తులు కొనుక్కుంటున్నానని తెలిపాడు. బాలయ్య ప్రైవేట్ జెట్ కొనుక్కోవచ్చుగా అనడంతో త్వరలోనే అది కూడా ప్లాన్ చేస్తాను అని తెలిపాడు ప్రభాస్.