Prabhas The raja saab movie first day collection
The Rajasaab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘ది రాజాసాబ్’. దర్శకుడు మారుతీ తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హారర్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మిక్సుడ్ టాక్ వచ్చింది. నిజానికి, చాలా కాలం తరువాత ఈ సినిమాలో వింటేజ్ లుక్ లో కనిపించాడు.
అలాగే డాన్సులు కూడా కుమ్మేశాడు. దీంతో, ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నారు. కానీ, ఆ అంచనాలను అందుకోవడంలో రాజాసాబ్(The Rajasaab) అంతగా సక్సెస్ కాలేదు అనే చెప్పాలి. దీంతో, ఆడియన్స్ నుంచి సినిమాకు మిక్సుడ్ టాక్ వచ్చింది. నార్మల్ ఆడియన్స్ మాత్రమే కాదు కనీసం ప్రభాస్ ఫ్యాన్స్ సైతం ఈ సినిమాతో హ్యాపీ గా లేరు అని తెలుస్తోంది.
Amitabh Bachchan: అమితాబ్ కి తప్పిన ప్రమాదం.. ఎయిర్ పోర్ట్ లో అద్దాలు ధ్వంసం!
దీంతో, ఈ ఎఫెక్ట్ రాజాసాబ్ ఫస్ట్ డే కలక్షన్స్ మీద పడింది. తాజాగా రాజాసాబ్ మూవీ ఫస్ట్ డే కలక్షన్స్ ను నిర్మాత టీజీ విశ్వప్రసాద్ అధికారికంగా తెలిపారు. ఈ సినిమాకు మొదటిరోజు రూ.112 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయట. ప్రభాస్ గత చిత్రాలతో పోల్చితే ఇది చాలా తక్కువ అనే చెప్పాలి. కల్కి 2898 ఏడీ సినిమా మొదటిరోజు ఏకంగా రూ.191 కోట్ల భారీ వసూళ్లను రాబట్టింది.
ఇక సలార్ సినిమా మొదటిరోజు రూ.178 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ రెండింటితో పోల్చితే రాజాసాబ్ చాలా తక్కువ కలెక్ట్ చేసిందనే చెప్పాలి. దీంతో, ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు. మరి రానున్న రోజుల్లో రాజాసాబ్ సినిమాకు ఎలాంటి కలక్షన్స్ వస్తాయి అనేది చూడాలి.
Prabhas the rajasaab movie first day collections