Amitabh Bachchan: అమితాబ్ కి తప్పిన ప్రమాదం.. ఎయిర్ పోర్ట్ లో అద్దాలు ధ్వంసం!
సూరత్ ఎయిర్ పోర్ట్ లో ధ్వంసమైన అద్దాలు. అమితాబ్(Amitabh Bachchan) కి తప్పిన ప్రమాదం.
Amitabh Bachchan narrowly escaped an accident at Surat Airport.
- సూరత్ లో ఎయిర్ పోర్ట్ లో అమితాబ్
- భారీగా వచ్చిన అభిమానులు
- పగిలిన ఎయిర్ పోర్ట్ అద్దాలు.. అమితాబ్ కి తప్పిన ప్రమాదం
Amitabh Bachchan: హీరోలపై అభిమానులకు ఎనలేని ప్రేమ ఉంటుంది. కొంతమంది వాళ్ళని ఇంట్లోవాళ్ల కంటే ఎక్కువగా ఇష్టపడతారు. కానీ, కొన్నిసార్లు మాత్రం అది ప్రమాదంగా మారే అవకాశం కూడా ఉంది. ఒక్కోసారి స్టేజిలపైకి దూసుకువస్తూ తమ అభిమానాన్ని చాటుకోవాలని చూస్తూ ఉంటారు. ఇలాంటి సంఘటనల్లో హీరోలు కిదపడిపోయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.
తాజాగా ఇలాంటి సంఘటనే బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) కి ఎదురయ్యింది. ఒకరకంగా చెప్పాలంటే పెద్ద ప్రమాదమే తప్పింది అని చెప్పాలి. తాజాగా అమితాబ్ బచ్చన్ సూరత్ వెళ్లారు. దీంతో, ఆయన్ని చూసేందుకు సూరత్ ఎయిర్ పోర్ట్ కి భారీగా ఆయన అభిమానులు చేరుకున్నారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఒక్కసారిగా ఎగబడ్డారు.
Pragya Jaiswal: పొట్టి నిక్కర్ లో ప్రగ్యా.. ట్రెండీ లుక్స్ అదుర్స్.. ఫొటోలు
ఆ జనాలను కంట్రోల్ చేయడం సెక్యూరిటీ వల్ల కూడా కాలేదు. ఒక్కసారిగా జనం అమితాబ్ మీదకు ఎగబడటంతో తోపులాట జరిగి పక్కనే ఒక్క ఎయిర్ పోర్ట్ అద్దం ధ్వంసం అయ్యింది. అమితాబ్ ఆ అద్దానికి కాస్త దూరంగా ఉండటంతో పెద్ద ప్రమాదమే తప్పింది. లేదంటే, ఆ అద్దం అమితాబ్ మీదపడి పెద్ద గాయాలే అయ్యేది. దీంతో, వెంటనే అలర్ట్ అయిన సెక్యూరిటీ అమితాబ్ ని అక్కడినుంచి తరలించారు. ఈ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ తెలుగులో కల్కి 2 సినిమా చేస్తున్నాడు. బ్లాక్ బస్టర్ కల్కి సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా జూన్ లో షూటింగ్ మొదలుకానుంది. మొదటి షెడ్యూల్ లోనే అమితాబ్ షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
