Prabhas the Raja Saab sequel Raja Saab Circus.
The Rajasaab sequel: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతీ కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది రాజాసాబ్’. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంజయ్ దత్, జరీనా వాహబ్ కీ రోల్స్ చేసిన ఈ హారర్, కామెడీ అండ్ ఫాంటసీ మూవీ భారీ అంచనాల మధ్య నేడు అంటే జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో, థియేటర్స్ లో ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు.
ఇక సినిమాకు కూడా ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వస్తోంది. చాలా కాలం తరువాత ప్రభాస్ వింటేజ్ లుక్స్ లో కనిపించడం. కామెడీ, డాన్స్ తో కుమ్మేయడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. ఇక నార్మల్ ఆడియన్స్ సైతం సినిమాలో కామెడీకి, నానమ్మ ఎమోషన్స్ కి బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇదిలా ఉంటే, ఈ సినిమాలో ప్రభాస్ జోకర్ లుక్ లో కనిపించాడు.
The Rajasaab: అర్ధరాత్రి జీవో జారీ.. తెలంగాణాలో రాజాసాబ్ టికెట్ ధరలు పెంపు
ఆ లుక్ గురించి దర్శకుడు మారుతీని అడగగా.. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని, ఆ సీక్వెల్(The Rajasaab sequel) లో జోకర్ పాత్ర ప్రధానంగా ఉంటుంది అని చెప్పాడు. ఇప్పుడు, సినిమా విడుదల తరువాత ఆ సీక్వెల్ ను అధికారికంగా ప్రకటించాడు. రాజాసాబ్ సినిమా చివర్లో రాజాసాబ్ సీక్వెల్ కోసం హింట్ ఇచ్చాడు. అలాగే, ఈ సీక్వెల్ టైటిల్ ని కూడా రివీల్ చేశారు.
ది రాజాసాబ్ సీక్వెల్ కు ‘రాజాసాబ్ సర్కస్ 1935’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. టైటిల్ చాలా కొత్తగా ఉంది. అది ప్రభాస్ జోకర్ గా చేస్తున్నాడు అనేసరికి ఈ సీక్వెల్ పై అంచనాలు పెరుగుతున్నాయి. మరి ఈ సీక్వెల్ ఎప్పుడు విడుదల అవుతుంది అనేది చూడాలి.